Saturn Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని గ్రహం.. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా!

Gemini, Leo and Pisces Zodiac Sign peoples to become millionaires due to Saturn Transit 2023. శని గ్రహం 2023 జనవరి 17న మకర రాశిని విడిచిపెట్టి.. కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 4, 2023, 11:59 AM IST
  • 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని గ్రహం
  • ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా
  • జనవరి 17న మకర రాశిని విడిచిపెట్టి
Saturn Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని గ్రహం.. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా!

Saturn Transit 2023 after 30 years will make these 3 signs become millionaires: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది. గ్రహాల సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. శని గ్రహం అంన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని ఒక రాశిలో రెండున్నరేళ్లు ఉంటుంది. ఆ లెక్కన మళ్లీ అదే రాశికి చేరడానికి 30 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం 2023 ప్రారంభంలో కుంభ రాశిలోకి శని గ్రహం సంచరించబోతోంది.

శని ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నాడు. 2023 జనవరి 17న మకర రాశిని విడిచిపెట్టి.. కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభ రాశిలోకి శని గ్రహం ప్రవేశించడంతో.. కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పు కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం వల్ల ఈ 3 రాశుల వారు చాలా లాభాలను ఆర్జించనున్నారు. ఆ  మూడు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి: 
కుంభ రాశిలో శని సంచారం మిథున రాశి వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. మిథున రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో శని సంచరించబోతున్నాడు. ఇది చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. 2023లో మిథున రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలోమంచి ప్రయోజనాలు ఉంటాయి. విద్యకు సంబంధించిన విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు మీ ఇంటికి వస్తుంది.

సింహ రాశి:
శని దేవుడు సింహ రాశి వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తాడు. సింహ రాశికి చెందిన వ్యక్తులు ఏడాది పొడవునా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సింహ రాశిలో ఏడవ ఇంట్లో శని ప్రవేశించడంతో.. ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది. వ్యాపార ఒప్పందాలలో ప్రయోజనం ఉంటుంది. కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. 

మీన రాశి:
మీన రాశి వారికి శని సంచారం మంచి ఫలితాలనిస్తుంది. మీన రాశి చక్రంలోని 12వ ఇంట్లో శని సంచరించబోతున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారు వృధా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో ప్రతిష్ట కూడా పెరగనుంది. మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెట్టినట్లయితే.. గరిష్ట లాభం పొందగలుగుతారు. మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. 

Also Read: Kia Cars New Price: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ కారు కొనడానికి లక్ష అదనంగా చెలించాల్సిందే!

Also Read: Hyundai Car Sales 2022: 2022లో అత్యధిక అమ్మకాలతో దుమ్మురేపిందిగా.. ఈ ఎస్​యూవీ కార్ ముందు అన్ని బేజారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News