Seeing Peacock Good Luck: భారతదేశ జాతీయ పక్షి నెమలి కాబట్టి భారతదేశంలో నెమలికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అంతేకాకుండా ఈ పక్షికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అంతేకాకుండా నెమలిని కార్తీకేయ వాహనంగా కూడా చెప్పకుంటూ ఉంటారు. అయితే వాతావరణాల్లో మార్పుల వల్ల అడవుల్లో ప్రస్తుతం నెమలు కనుమరుగవుతున్నాయి. ఇక నగరాల విషయానికొస్తే కేవలం పార్కుల్లోనే ఇవి కనిపిస్తున్నాయి. జోతిష్య శాస్త్రం ప్రకారం నెమలి అకస్మాత్తుగా కనిపిస్తే..చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని శాస్త్రం పేర్కొంది. నెమలి కనిపించడం వల్ల దీని ప్రతి ఫలాలు మానవులకు కూడా లభిస్తాయని శాస్త్రం నమ్ముతోంది. అంతేకాకుండా వీటి రెక్కలు అన్ని రకాల గ్రహ దోషాలను తొలగించడానికి కృషి చేస్తాయని సమాచారం..
ఇలా నెమలి కనిపిస్తే అంతా శుభమే..
ఇంట్లో నెమలి:
ఉదయాన్నే హఠాత్తుగా నెమలి మీ ఇంటికి వస్తే.. మీపై అదృష్ట వర్షం కురిసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుందని శాస్త్రం పేర్కొంది. దీని వల్ల ఇంట్లో కొన్ని శుభ కార్యాలు కూడా జరగవచ్చు.
ఉదయం నెమలి దర్శనం:
తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు రాగానే అకస్మాత్తుగా నెమలి కనిపించిందంటే.. మీకు రోజంతా శుభప్రదంగా ఉండబోతోందని అర్థం. ముఖ్యంగా మీరు పని చేసే కార్యాలయాల్లో అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. తెల్లవారుజామున నెమలి స్వరం వినడం లేదా నెమలి ఈకలను చూడటం కూడా శుభప్రదమని శాస్త్రంలో పేర్కొన్నారు.
కలలో నెమలి:
కలలో నెమలి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తే.. అది భవిష్యత్తులో జరిగే విజయాల గురించి చెబుతోందని ఆర్థం చేసుకోవచ్చు. ఇలా కనిపిస్తే త్వరలోనే భవిష్యత్‌లో మంచి విజయాలు కూడా సాధించే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు కూడా తీరుతాయి.
ఎగిరే నెమలి:
ఎగిరే నెమలిని చూడటం చాలా అరుదు. ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే ఇలాంటి దృష్యాలు చూడడం వల్ల ఎక్కడి నుండైనా శుభ ఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది.
నృత్యం చేస్తున్న నెమలి:
డ్యాన్స్ చేసే నెమలి కూడా కనిపించడం చాలా అరుదు..కానీ ఇలా కనిపిస్తే భవిష్యత్‌లో రాగల సమస్యల గురించి ముందుగానే తెలుసుకోగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జీవితంలో కొత్త పరిణామాలు ఎదురవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన
Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook