Shani Amavasya 2022: రేపే చివరి శని అమావాస్య... ఈ 5 రాశుల అదృష్టం కేక..!

Bhadrapada Amavasya 2022:  భాద్రపద మాసంలోని అమావాస్య సంవత్సరంలో చివరి శని అమావాస్య కూడా. శనిదేవుని అనుగ్రహంతో 5 రాశుల వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 09:18 AM IST
Shani Amavasya 2022: రేపే చివరి శని అమావాస్య... ఈ 5 రాశుల అదృష్టం కేక..!

Bhadrapada Amavasya 2022: ఈ ఏడాది చివరి శని అమావాస్య భాద్రపద మాసంలోనే వస్తుంది. రేపు అంటే ఆగస్టు 27న శని అమావాస్య లేదా భాద్రపద అమావాస్య వస్తుంది. ఈ రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు ఈ అమావాస్య శనివారం రావడంతో శనిదేవుడి ప్రత్యేక ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇది 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. 
మిథునం (Gemini): ఈ సమయంలో ఈ రాశివారు శుభవార్తలు వింటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. కొత్త జాబ్ వస్తుంది. నిరుద్యోగులు ఉపాధి పొందుతారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది.  

కన్య (Virgo): కన్యా రాశి వారికి ఉద్యోగ-వ్యాపారాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువు కోసం బయటకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కొత్త పనిని ప్రారంభించండి, మీరు శని అనుగ్రహంతో విజయం పొందుతారు. 

తుల (Libra): తులారాశిలో శని ధైయా కొనసాగుతోంది. కాబట్టి ఈ రాశివారు దీనిని ఉపశమనం పొందుతారు. ఆగిపోయిన పనులు శరవేగంగా పూర్తవుతాయి. కష్టాల నుండి గట్టెక్కుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులకు మంచి ఫలితాలను పొందుతారు.  

మీనం (Pisces): ఈ రాశివారికి శనిదేవుని అనుగ్రహంతో మంచి రోజులు మొదలవుతాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. లక్ కలిసి వస్తుంది. కెరీర్ లో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇదే మంచి సమయం. 

Also Read: Shanishchari Amavasya: ఈ రాశులవారు శనిశ్చరి అమావాస్య నాడు ఇలా చేస్తే.. శనిపీడ నుండి విముక్తి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News