Shani Dev: అర్ధాదియోగం వల్ల శని గ్రహంపై ప్రభావం.. ఇక ఈ రాశులవారి కష్టాలు తప్పవా..?

Shani Dev Effects: కొత్త సంవత్సరంలో చాలా రకాల రాశులు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశిల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశులవారి జీవితంలో చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 11:38 AM IST
 Shani Dev: అర్ధాదియోగం వల్ల శని గ్రహంపై ప్రభావం.. ఇక ఈ రాశులవారి కష్టాలు తప్పవా..?

Shani Dev Effects: మనిషి జీవితంలో విజయాలు అనేవి వారి జాతకాలను బట్టి జరుగుతూ ఉంటాయి. జాతకాలంలో గ్రహాలు మంచి దశలో ఉంటే జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గ్రహాల సంచారం కూడా ప్రత్యేక ప్రభావాన్ని మనిషి జీవితంపై చూపుతుంది. అయితే పెద్ద గ్రహాలు సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారికి మంచి జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే కొత్త సంవత్సరంలో మొదటి నెలలో 17వ తేదీ రాత్రి మాఘ కృష్ణ పక్ష దశమి తిథిన కుంభరాశిలో రెండు రాశులు సంచారం చేయబోతున్నాయి. దీంతో పలు రాశులవారి జీవితంలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ ప్రభావం ప్రత్యేక్షంగా శని గ్రహం పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో పలు మార్పలు సంభవిస్తాయి.

మీనరాశి:
 కుంభరాశిలోకి శని గ్రహం సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో మీన రాశి వారికి అర్ధాదియోగం ప్రారంభమవుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార ప్రభావంతో మీన రాశి వారి జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ క్రమంలో మీన రాశి వారు చాలా రకాల దుష్ర్పభావాలకు గురవుతారు. ఈ క్రమంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంచారం క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టాల పాలవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగాలు చేసే కార్యాలయాల్లో ఒత్తిడికి కూడా గురవుతారు.

* వచ్చే సంవత్సరంలో శని గ్రహం మీన రాశివారికి పన్నెండవ స్థానంలో ఉంటాడు. దీంతో మేష రాశివారికి శని బలహీనపడుతాడు. కాబట్టి ఈ క్రమంలో పనుల్లో ఆటంకంతో పాటు, తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ఈ క్రమంలో ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది.

 *ఈ క్రమంలో సంచారం కారణంగా  శనిదేవుని చెడు దృష్టి వృశ్చికరాశిపై కూడా పడే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ రాశివారికి కూడా  పనుల్లో జాప్యం జరగొచ్చు. అంతేకాకుండా ఒత్తిడి పెరిగి వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో కూడా వివాదాలు తలెత్తవచ్చు.

Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్

Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News