Shani Dev: ఇంట్లో శనిదేవుడిని పూజించేటప్పడు ఈ తప్పు చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది!

Shani Dev Worshiping: శనిదేవుడి చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి లైఫ్ కష్టాలమయం అవుతుంది. అందుకే  ఇంట్లో శని దేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 10:26 AM IST
  • శని దేవుడిని పూజించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి
  • ఇంట్లో శని దేవుడి విగ్రహం లేదా బొమ్మను ఉంచవద్దు
  • జీవితంలో ప్రతికూలతలను ఎదుర్కోవలసి రావచ్చు
Shani Dev: ఇంట్లో శనిదేవుడిని పూజించేటప్పడు ఈ తప్పు చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది!

Do Not keep Shani Dev Idols at Home:  పనులను బట్టి ఫలితానిచ్చే దేవుడు శని (Shani Dev). శని దేవుడి మంచిదృష్టి బిచ్చగాడిని కూడా బిలియనీర్ ను చేస్తుంది. శనివక్ర దృష్టి ధనవంతుడ్ని కూడా దరిద్రుడ్ని చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శనిదేవుడి అనుగ్రహం పొందాలని పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో శనిదేవుడిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకపోతే తీవ్ర దుష్ర్పభావాలను ఎదుర్కొవల్సి ఉంటుంది.

ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్ 22 తర్వాత శని కదలిక ప్రారంభమవుతుంది. అప్పటివరకు  తిరోగమనంలోనే ఉంటాడు. శని యెుక్క కదలిక ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి ఒక్కరూ శనియెుక్క వక్రదృష్టి పడకుండా చూసుకోవాలి. శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. 

ఇవి గుర్తించుకోండి
>>  శని విగ్రహం లేదా బొమ్మను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. నిజానికి శని దృష్టిలో ప్రతికూలత ఉంటుంది. కాబట్టి అతని కళ్లముందు ఎవరు నడవకూడదు. శని దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం సర్వనాశనమవుతుంది. 
>>  శని దేవుడిని పూజించేటప్పుడు అతని ముందు దీపం వెలిగించడం మానుకోవాలి. దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే పశ్చిమ దిశలో కూర్చుని శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి.
>>  ఇంట్లో శని విగ్రహం లేదా బొమ్మను ఉంచకుండా మానసికంగా వాటిని ధ్యానం చేయండి. మనస్ఫూర్తిగా శనిని ప్రార్థించండి. 

Also Read: Shani Dev Remedies: ఈ రోజే రెండో శ్రావణ శనివారం.. శని మహాదశ తొలగిపోవాలంటే ఈ 5 రాశులవారు ఇలా చేయండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x