Shani Dev: శనిదేవుడికి ఈ నెల ఇష్టమైన రాశులు ఇవే..వీరికి లాభాలే లాభాలు!

Shani Dev Favourite Zodiac Sign: ఫిబ్రవరి 11వ తేదిన శని గ్రహం కుంభరాశిలో ఆస్తమించింది. దీని కారణంగా కొన్నిరాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 01:16 PM IST
Shani Dev: శనిదేవుడికి ఈ నెల ఇష్టమైన రాశులు ఇవే..వీరికి లాభాలే లాభాలు!

Shani Dev Favourite Zodiac Sign: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలకి, తిరోగమనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు సంచారం చేయడం, ఇతర గ్రహాలతో కలవడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా శని లాంటి శక్తివంతమైన గ్రహాలు సంచారం, తిరోగమనం చేసినప్పుడు ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఫిబ్రవరి 11వ తేదీన సాయంత్రం 6:56 గంటలకు శనిగ్రహం కుంభరాశిలో కదలికలు జరిపింది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

తులా రాశి:
కుంభ రాశిలో శని గ్రహం అస్తమించడం వల్ల తుల రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఆస్తులు, కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో అనే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే వస్తువుల సౌకర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా పూర్వీకులు ఆస్తులు కూడా పొందుతారు. అలాగే వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. 

మిథున రాశి:
మిథున రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నవారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వివాహాలు కానీ వారు శుభవార్తలు వింటారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మేష రాశి:
శని అస్తమించడం మేష రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు., ఈ సమయంలో వీరికి సమాజంలో ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఇతర కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్స్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు కూడా కలుగుతాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News