Shani Dev Upay: పాదరక్షల పరిహారంతో శని నరదృష్టి మటు మాయం..

Shani Dev Upay: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పదరక్షల పరిహారాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిహారం పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలగొచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 04:47 PM IST
Shani Dev Upay: పాదరక్షల పరిహారంతో శని నరదృష్టి మటు మాయం..

Shani Dev Upay: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. శని అనుగ్రహం లభిస్తే జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శని దేవుని మంచి ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా శని వారం రోజు శని దేవునికి ఇష్టమైన రాశువారు పూజా కార్యక్రామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ నివారణ వల్ల శని దేవుని అనుగ్రహం లభించి జీవితంలో ప్రతి సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి శని మంచి ప్రభావం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

పాదరక్షలకు సంబంధించిన పరిహారాలు:
>>శని దేవుని చెడు ప్రభావంతో బాధపడుతున్నవారు శని వారం రోజున అస్సలు బూట్లు, చెప్పులు కొనకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>అంతేకాకుండా చిరిగిన లేదా కత్తిరించిన బూట్లు, చెప్పులు ఎప్పుడూ వేసుకోవద్దు.
>>ఏదైనా శుభకార్యం లేదా ఇంటర్వ్యూ సమయంలో శుభ్రంగా, అందమైన బూట్లు ధరించాలి. ఇలాంటి వేసుకుంటేనే సానుకూల ఫలితాలు పొందుతారు.
>> శని చెడు ప్రభావంతో బాధపడుతున్న వారు అస్సలు శనివారం నల్ల తోలు బూట్లు వేసుకోవద్దు. ఒక వేళ కొంటే జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయని నమ్ముతారు.
>>పాదరక్షలు, చెప్పులు కానుకగా కానీ అస్సలు ఇవ్వకూడదని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
>>శని సాడే సతి బాధపడేవారు శనివారం రోజు పేదవారికి బూట్లు లేదా చెప్పులు దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>నల్ల బూట్లు లేదా చెప్పులు ధరించి.. హనుమాన్ ఆలయాని వెళ్లి అక్క వాటిని వదిలి తిరిగి వస్తే జీవితంలో ఆనందం లభిస్తుంది.

Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..

Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News