Shani Gochar on April 10 2023: హిందూ పంచాంగం ప్రకారం శని అంటే న్యాయదేవతగా భావిస్తారు. మనిషి చేసే పనుల ఆధారంగా శని ప్రతిఫలాన్నిస్తాడు. అందుకే గ్రహాల ప్రపంచంలో శనికి ఈ స్థానం. జనవరి 17 నుంచి శని కుంభరాశి ప్రవేశం సందర్భంగా మూడు రాశులపై అదృష్టం వర్షమై కురుస్తుంది. సంపదతో తులతూగుతారు. ఆ వివరాలు మీ కోసం..
జనవరి 17వ తేదీనే కుంభరాశిలో శని గోచారమైంది. ఇప్పుడు శని గ్రహం దృష్టి వృశ్చిక రాశిపై ఉంది. వాస్తవానికి జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి శుక్రుడు ఏడవ దృష్టి. ఈ నేపధ్యంలో మాలవ్య, శశ రాజయోగం ఏర్పడనుంది. వృశ్చిక రాశికి అధిపతి మంగళ గ్రహం. ఏప్రిల్ 10 నుంచి శని దశ దృష్టి ప్రభావం 3 రాశులపై అత్యంత శుభసూచకంగా ఉండనుంది. సాధారణంగా సూర్యుడి కుమారుడైన శని గ్రహానికి కోపం కల్గించే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే న్యాయం చేసేందుకు, శిక్ష విధించేందుకు శివుడు శనిగ్రహానికి వరమిచ్చాడని హిందూ ధర్మం చెబుతోంది.
ఇక ఏప్రిల్ 10 నుంచి అంటే ఇవాళ్టి నుంచి శని దశమ దృష్టి కోసం ఆ మాడు రాశులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది.
సింహ రాశి
శనిగ్రహం దశమ దృష్టి ఇవాళ్టి నుంచి సింహరాశి జాతకులకు లాభాల్ని కలగజేయనుంది. ఈ సమయంలో మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. కళారంగానికి చెందిన వ్యక్తులకు మంచి సమయం.
వృషభ రాశి
శనిగ్రహం వృషభ రాసిలో కర్మపాదంలో గోచారం చేయనున్నాడు. శని దృష్టి ఈ రాశి 7వ పాదంలో ఉండటం వల్ల వృషభ రాశి జాతకులకు అత్యంత మంగళకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. పెండింగులో ఉన్న పనులు నెరవేరుతాయి. పెళ్లి జీవితం సుఖమయంగా ఉంటుంది. కెరీర్ ఉన్నతస్థితికి చేరుకుంటుంది.
Also Read : Saturn Rise 2023: మార్చ్ 5 నుంచి ఆ 4 రాశులకు కష్టాలు ప్రారంభం, తస్మాత్ జాగ్రత్త
కుంభ రాశి
శని గ్రహం దశమ దృష్టి కుంభరాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉండనుంది. కుంభరాశిలో శని గ్రహం శశ రాజయోగం ఏర్పరిస్తే శుక్రుడి గోచారంతో మాలవ్య రాజయోగం కలగనుంది. ఫలితంగా కుంభరాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు చాలా బాగుంటుంది. అత్యంత అనువైన సమయంగా చెప్పవచ్చు. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
Also Read: Navapancham Rajayogam: 300 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశులవారి జీవితం ఆనందమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook