Shani Effect 2022: శని జయంతి సమీపిస్తోంది. శని జయంతి నాడు కొన్ని మార్గాలు అనుసరించడం ద్వారా శనిపీడ నుంచి విముక్తులు కావచ్చు. శనిదోషం, శని ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మే 30వ తేదీ సోమవారం నాడు శని జయంతి ఉంది. ఆ రోజున సోమవతి అమావాస్యతో పాటు వట సావిత్రి వ్రతం కూడా ఉంది. జ్యేష్ఠ అమావాస్యనాడు సూర్య పుత్రుడు శని దేవుడు జన్మిస్తాడు. శనిదేవుడుని కర్మ ఫలదాతగా భావిస్తారు. చేసిన పనుల ఆధారంగా ప్రతిఫలం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు శని దోషం ఉంటుంది. ఫలితంగా ఆ వ్యక్తి సమస్యలకు లోనవుతాడు. అతడు చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. శని దృష్టి ఒక వ్యక్తిపై పడిందంటే..ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి బ్యాడ్ టైమ్ ప్రారంభమైనట్టే. అయితే శని జయంతి నాడు కొన్ని ఉపాయాలు పాటిస్తే..శని పీడ నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
శని జయంతి నాడు ప్రతి వ్యక్తి శని దేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం. ఈ రోజున శనిదేవుడి పూజను..అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు, షమీ ఆకులు, నల్ల నువ్వులు, ఆముదం నూనె వంటివాటితో చేయాలి. ఫలితంగా శని దోషం, శని ప్రభావం పోతుంది.
శని జయంతి నాడు ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్లి శనిదేవుడికి నమస్కరించాలి. ఓ పెద్ద దీపంలో ఆముదం నూనె వేసి..అందులో ప్రతిబింబాన్ని చూసుకుని..దానాలు చేయాలి. ఫలితంగా శని దోషం పోతుంది. శని పీడ పోవాలంటే..శని దేవుడిని ఆముదం నూనెతో పూజలు చేయాలి. అదే నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది.
శని జయంతి నాడు ఆముదం నూనెలో నల్లనువ్వులు వేసి శనిదేవుడికి అర్పించాలి. లేదా ఆ నూనెలో 2 లవంగాలు వేసి శని దేవుడికి హారతి ఇవ్వాలి. శని గ్రహం కటాక్షంతో ఆ దోషం పోతుంది. శని జయంతి నాడు సాయంత్రం వేళ..రావి చెట్టు కింద నవ్వులు లేదా నూనెతో దీపం వెలిగించాలి.
Also read : Shani Jayanti 2022: ఈ 3 రాశుల వారికి శని సడే సతి తొలగిపోవాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి