Shani Sade Sati effect: తిరోగమన శని ఎఫెక్ట్... త్వరలో ఈ రాశులపై ముగియనున్న శని మహాదశ!

Shani Dev Sade Sati:  మకరరాశిలో శని తిరోగమనం కారణంగా శని సాడే సతి, ధైయా ఐదు రాశులలో కొనసాగుతోంది. ఇది త్వరలోనే కొన్ని రాశులపై ముగియనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 09:50 AM IST
Shani Sade Sati effect: తిరోగమన శని ఎఫెక్ట్... త్వరలో ఈ రాశులపై ముగియనున్న శని మహాదశ!

Shani Dev Sade Sati:  మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. మంచి పనులను చేస్తే మంచి ఫలితాలను, చెడు పనులను చేస్తే శిక్షించడం చేస్తాడు శనిదేవుడు. అందుకే శనిని న్యాయదేవుడు అంటారు. ప్రస్తుతం శని గ్రహం జూలై నుంచి మకరారాశిలో తిరోగమనంలో (Shani retrograde in Capricorn 2022) ఉన్నాడు. అక్టోబరు 23 నుంచి అదే రాశిలో మార్గంలో ఉంటాడు. అదే స్థితిలో జనవరి 17, 2023 వరకు కొనసాగుతాడు. మకరరాశిలో తిరోగమన శని సంచారం అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. 

మకరరాశిలో శని తిరోగమనం కారణంగా శని సాడే సతి (Shani Sade Sati), ధైయా ఐదు రాశులలో కొనసాగుతుంది. మూడు రాశులపై సాడే సతి, రెండు రాశుల్లో దైయా (Shani dhaiya) కొనసాగుతోంది.  ధనస్సు, మకరం, కుంభం రాశులవారిపై శని సాడే సతి కొనసాగుతోంది. మిథునం, తులరాశి వారిపై శని ధైయా నడుస్తోంది. ఈ రెండు రాశులపై ధైయా త్వరలోనే ముగియనుంది. జనవరి 17, 2023 వరకు ఈ రాశివారిపై శని దైయా ఉంటుంది. జనవరి 17 తర్వాత శని మకరరాశిని విడిచిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశిస్తే ధనస్సు రాశివారిపై శని సాడే సతి ముగిసి... మీనరాశిలో అర్ధశతంక ప్రారంభమవుతుంది. 

Also Read: Mars Transit in Gemini 2022: కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారి లైఫ్ అదుర్స్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News