Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?

Shani Vakri 2024: జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 22, 2024, 10:26 AM IST
Shani Vakri 2024: జూన్ 30 నుంచి ఈ రాశులవారికి ధనమే, ధనం.. మీ రాశి కూడా ఉందా?

Shani Vakri 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మఫల దాతగా పిలుస్తారు. ఎందుకంటే శని దేవుడు వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. ప్రస్తుతం శని గ్రహం సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచార క్రమంలో ఉంది. ఇదిలా ఉంటే శని గ్రహం ఆదివారం జూన్ 30న 12 గంటలకు తిరోగమనం చేయబోతోంది. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా సంచారం, తిరోగమనం చేస్తూ ఉంటుంది. జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం దాదాపు నవంబర్ 15 తేది వరకు తిరోగమన దశలోనే ఉంటుంది. ఈ గ్రహం దాదాపు 139 రోజుల పాటు తిరోగమన దశలోనే ఉండడం వల్ల ఏలినాటి శనితో బాధపడేవారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి విపరీమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
శని తిరోగమనం కారణంగా అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరికి శని దేవుడి అనుగ్రహం లభించి డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే అనుకున్న లాభాలు కూడా సులభంగా పొందగలుగుతారు. దీంతో పాటు ఈ సమయంలో కీర్తి, ప్రతిష్టలు కూడా సులభంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో సంచలనమైన నిర్ణయాలు కూడా ఎంతో సులభంగా తీసుకుంటారు. 

ధనుస్సు రాశి:
శని తిరోగమన ప్రభావం ధనుస్సు రాశివారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరు జీవితంలో ఊహించని మార్పులకు గురవుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ సమయలో ఎంతో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా జీవితం మొత్తం శృంగార భరితంగా ఉంటుంది. కుటుంబ జీవితం గడుపుతున్నవారికి జీవితంలో సంతోషం కూగా పెరుగుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకరరాశి:
శని అనుగ్రహం వల్ల మకర రాశివారికి కూడా సంపద పూర్తిగా పెరుగుతుంది. ఈ సమయంలో వీరు ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా నిలిపోయిన డబ్బు కూడా తిరిగి పొందే ఛాన్స్‌ ఉంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో కుటుంబ సభ్యులు సపోర్ట్‌ లభించి మంచి లాభాలు పొందుతారు. ప్రతి మాట ఈ సమయంలో ఎంతో తెలివిగా మాట్లాడుతారు. అంతేకాకుండా ఆర్థికం కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News