Sharad Purnima 2022 Remedies: ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడే శరద్ పూర్ణిమ జరుపుకుంటారు. దీనినే శరత్ పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లోని హిందువులు ఈ పండుగను (Sharad Purnima 2022) ఘనంగా జరుపుకుంటారు. ఈసారి శరద్ పూర్ణిమ రేపు అంటే అక్టోబర్ 09న వస్తుంది. ఈరోజు రాత్రి లక్షీదేవి ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్ముతారు.
ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. శరద్ పూర్ణిమ నాడు గ్రహాల సంచారం మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. అయితే ఈ రోజున కొన్ని రాశులవారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రాబోయే 24 గంటల్లో ఏ వ్యక్తులపై డబ్బు వర్షం కురవబోతుందో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి శరద్ పూర్ణిమ చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. టూర్కు వెళ్లే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. డబ్బు ఆదా చేస్తారు. వాహనం కొనాలనే కోరిక త్వరలోనే నెరవేరుతుంది.
కన్య (Virgo)- ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆఫీసులో ఆదరణ పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు భారీగా లాభపడతారు.
తుల (Libra)- ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. ఆఫీసు పని మీద బయటకు వెళ్లే అవకాశం ఉంది. పార్ట్నర్ షిప్ తో చేసే వ్యాపారం లాభాలను తెస్తుంది.
ధనుస్సు (Sagittarius)- శరద్ పూర్ణిమ నాడు ధనుస్సు రాశి వారు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. వ్యాపారులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు అప్పులను తీరుస్తారు. పాత పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు.
Also Read: Surya Gochar 2022: అక్టోబరు 17న తులరాశిలోకి సూర్యుడు... నెల రోజులపాటు ఈరాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook