Shani Uday 2023: శష్ మహాపురుష రాజయోగంతో ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Uday 2023: రీసెంట్ గా శనిదేవుడు శష్ మహాపురుష రాజయోగాన్ని సృష్టించారు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2023, 02:35 PM IST
Shani Uday 2023: శష్ మహాపురుష రాజయోగంతో ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Uday 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని కర్మ గ్రహంగా భావిస్తారు. శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్లు పడుతుంది. శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా శష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని  చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

శష్ మహాపురుష రాజయోగం ఈ రాశులకు వరం
మిధునరాశి
శని ఉదయించడం మిథునరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి యెుక్క తొమ్మిదో స్థానంలో శష్ రాజయోగం ఏర్పడుతోంది. దీని కారణంగా మిథున రాశివారికి ఆకస్మిక ధనలాబం కలుగుతుంది. మీ పని నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీకు పట్టరాని సంతోషం కలుగుతుంది. మీ ఐశ్వర్యం పెరిగే అవకాశం ఉంది. మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
సింహరాశి 
సింహ రాశి వారికి శనీశ్వరుడు ఉదయించడం శుభపరిణామం. మీ రాశిలో ఏర్పడిన శష్ రాజ్ యోగం సప్తమంలో ఏర్పడుతోంది. వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీరు కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు.
కుంభ రాశి
మీ రాశి యెుక్క లగ్న గృహంలో షష్ రాజయోగం ఏర్పడింది. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అపారమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 

Also Read: Sri Rama Navami 2023: రేపే శ్రీరామ నవమి... శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News