Shattila Ekadashi 2023 Significance: మాఘమాసంలో వచ్చే ఏకాదశులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని శటిల ఏకాదశి అంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఇవాళ ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా మీరు పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ ఏకాదశి జనవరి 18 బుధవారం నాడు వస్తుంది. అంతేకాకుండా ఇదే రోజున మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. శుభ సమయం మరియు పూజా విధానం తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
వైదిక క్యాలెండర్ ప్రకారం, శటిల ఏకాదశి శుభ సమయం జనవరి 17, 2023న సాయంత్రం 06:04 గంటలకు ప్రారంభమై జనవరి 18, 2023 సాయంత్రం 04:02 గంటలకు ముగుస్తుంది. జనవరి 19 ఉదయం 7 గంటల తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు.
శుభయోగం
పంచాంగం ప్రకారం, ఈ రోజున 3 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 07.16 నుండి ప్రారంభమై సాయంత్రం 05.22 వరకు ఉంటుంది. మరోవైపు, అమృత సిద్ధి యోగం జనవరి 17 ఉదయం 07:12 నుండి ప్రారంభమై సాయంత్రం 05:24 వరకు కొనసాగుతుంది. దీనితో పాటు జనవరి 18వ తేదీ ఉదయం 05.58 గంటలకు వృద్ధి యోగం ప్రారంభమై జనవరి 19వ తేదీ తెల్లవారుజామున 02.46 గంటల వరకు కొనసాగుతుంది. ఈ శుభ యోగాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. దీనితో పాటు ఈ యోగాల్లో పూజలు చేయడం వల్ల మీకు రెట్టింపు లాభం లభిస్తుంది.
పూజా విధానం
ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి చందనం పూయాలి. బెల్లం మరియు నువ్వులతో చేసిన లడ్డూలను ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. తరువాత విష్ణు సహస్రనామాలు పఠించి హారతి ఇవ్వండి. దీంతోపాటు మరుసటి రోజు బ్రాహ్మణులకు విందు ఏర్పాటు చేసి నువ్వులను దానం చేయండి. శాస్త్రాల ప్రకారం, ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజున నువ్వులను దానం చేయడం వల్ల మీ స్వర్గానికి దారులు తెరుచుకుంటాయి.
Also Read: Budh Gochar 2023: బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశుల వారు ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.