Krishna Janmashtami 2022: మరో నాలుగు రోజులు అంటే ఆగస్టు 13 నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి (Shri Krishna Janmashtami 2022) పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజున చిన్న పిల్లలను శ్రీకృష్ణుడిలా రెడీ చేయడం, వెన్న తినిపించడం, ఉట్టి కొట్టడం మెుదలైన కార్యక్రమాలు చేస్తారు. ఈసారి భాద్రపద కృష్ణ పక్షం అష్టమి తిథి రెండు రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో జన్మాష్టమి తేదీ విషయంలో ప్రజల్లో గందరగోళం చోటుచేసుకుంది. కృష్ణాష్టమి ఖచ్చితమైన తేదీ, ముహూర్తం గురించి తెలుసుకుందాం.
ఆగస్టు 18 లేదా 19?
భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి 18 ఆగస్టు 2022 గురువారం 09:21 నుండి ప్రారంభమై...అష్టమి తిథి శుక్రవారం, 19 ఆగస్టు 2022 రాత్రి 10.50 గంటలకు ముగుస్తుంది. గ్రంథాల ప్రకారం, కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు, కాబట్టి చాలా మంది ఆగస్టు 18 నే జన్మాష్టమి జరుపుకుంటారు. అయితే సూర్యోదయం ప్రకారం, ఆగస్టు 19 న జన్మాష్టమి జరుపుకోవడం కూడా ఉత్తమంగా కొందరు భావిస్తున్నారు.
పూజ ముహూర్తం
ఆగస్టు 18వ తేదీ 12:20 నుండి 01:05 వరకు శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి మంచి సమయం. పూజ వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడే.. వృషి మరియు ధ్రువ యోగాల కలయిక ఉంది. దీంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత పెరిగింది. వృద్ధి యోగం 17 ఆగస్టు 2022న రాత్రి 08.56 గంటలకు ప్రారంభమై ఆగస్టు 18న రాత్రి 08.41 గంటలకు ముగుస్తుంది. వృద్ధి యోగంలో కన్నయ్యను పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ధృవ యోగం 18 ఆగస్టు 2022న రాత్రి 08.41 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 19 రాత్రి 08.59కి ముగుస్తుంది.
Also Read: Venus Transit 2022: కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి జాక్ పాట్! ప్రమోషన్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook