Shukra Gochar in Dhanu 2022: శుక్రుగ్రహం జోతిష్య శాస్త్రంలో చాలా ప్రముఖ్య కలిగి ఉంటాడు. ఈ గ్రహాన్ని ప్రేమ, శృంగారం, అందం, ఆకర్షణకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఇదే గ్రహం ఇప్పుడు సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం వల్ల పలు రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని రాశువారు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచారం డిసెంబర్ 5 జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచే పలు రాశువారి జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ సంచారం వల్ల ఏ రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శుక్ర సంచారంతో ఈ రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు:
మేషం:
శుక్రుని సంచారం మేష రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు కలిగించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. ఈ సంచారం వల్ల వైవాహిక జీవితంలో కూడా ఆనందం పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా వీరు బలపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం:
ఈ సంచారం వల్ల వృశ్చిక రాశి వారి జీవితాల్లో కూడా చాలా రకాల మార్పులు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాశి వారి జీవితాల్లో శుక్ర సంచారం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరు భారీ మొత్తంలో షాపింగ్స్ చేసి నగలు, బట్టలు కొనే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కెరీర్‌లో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సింహం:
ఈ శుక్రుని సంచారం వల్ల అన్ని రాశువారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఈ నాలుగు రాశువారు అధిక లాభాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరి ఆదాయం పెరుగుతుంది. సీనియర్ల మద్దతు, శంసలు పొందుతారు.
కుంభం:
శుక్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ, మాధుర్యం పెరుగుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స్
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook