Shukra Gochar 2022: గణేశ చతుర్థి నాడే శుక్రుడు సంచారం...ఈ 3 రాశులవారికి అదృష్టం!

Shukra Gochar 2022: శుక్రుని రాశిచక్రంలో మార్పు మొత్తం 12 రాశుల ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. అయితే ఇది 3 రాశులవారికి కలిసి వస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 11:23 AM IST
Shukra Gochar 2022: గణేశ చతుర్థి నాడే శుక్రుడు సంచారం...ఈ 3 రాశులవారికి అదృష్టం!

Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాల తమ రాశిని మారుస్తూ ఉంటాయి. ఈ నెల చివరిలో అంటే ఆగస్టు 31న శుక్రుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలో (Venus Tranit In Leo 2022) సంచరించబోతున్నాడు. అదే రోజు వినాయక చవితి రావడం విశేషం. ప్రేమ, శృంగారం, వైవాహిక జీవితం, ఐశ్వర్యానికి కారకుడు శుక్రుడు. దీని రాశిమార్పు మెుత్తం 12 రాశుల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఇది ముఖ్యంగా 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో చూద్దాం. 

కర్కాటకం (Cancer): శుక్రుని రాశి మార్పు కర్కాటక రాశి వ్యక్తుల జీవితాలపై శుభప్రభావాన్ని చూపుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడు కర్కాటక రాశి యెుక్క రెండో ఇంటిలో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశివారు భారీగా డబ్బు సంపాదిస్తారు. అనేక మార్గాలుగా ద్వారా వీరికి డబ్బు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. 

వృశ్చిక రాశి (Scorpio); శుక్రుడి రాశిచక్రంలో మార్పు (శుక్ర గ్రహ గోచారం 2022) వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క సంచారం పదవ ఇంట్లో జరగబోతోంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ రాశివారికి జాబ్ వస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పదోన్నతి కూడా లభిస్తుంది.

తుల రాశి (Libra): శుక్రుడి రాశి మార్పు తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క 11వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. లక్ కలిసి వస్తుంది.

Also Read: Mangal Gochar 2022: వృషభరాశిలోకి కుజుడు.. రాబోయే 68 రోజులపాటు ఈ రాశులకు లాభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News