Skanda sashti festival: శివపార్వతులు చిన్న కుమారుడికి కుమార స్వామి అని పిలుస్తుంటారు. ఈయనకు అనేక పేర్లు ఉన్నాయి. స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, కార్తీకేయ, మయుర వాహనాడు.. అని వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. అయితే..కార్తికేయుడి జన్మతిథిని స్కంద షష్ఠి పండుగగా జరుపుకుంటారు. ప్రతి నెల శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠి జరుపుకుంటారు.
అదే విధంగా ఈరోజున కార్తీకేయుడికి కొన్ని పూజలు , పరిహారాలు పాటిస్తే కాలసర్పదోషాలు, జీవితంలోని అనేక సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుందని చెబుతుంటారు. ప్రస్తుతం కొత్త ఏడాది ప్రారంభమైంది. జనవరి నెల 5వ తేదీన స్కంద షష్ఠి వస్తుంది. ముఖ్యంగా ఈరోన కార్తీకేయుకుడికి పూజలు, అభిషేకాలు చేయించాలని పండితులు చెబుతున్నారు.
రాహు, కేతుల దోషాలు ఉన్నవారు.. పెళ్లి కాకుండా.. పలు సమస్యలతో ఉన్న వారు.. ఈరోజున నాగ ప్రతిష్ట చేయిస్తే ఆ దోషాల నుంచి ఉపశమనం కల్గుతుందంట. స్కందుడి అనుగ్రహాం కోసం.. డిసెంబరు 5న అంటే ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచీ , స్నానాలు చేసుకుని, శుభ్రమైన బట్టలు వేసుకుని గుడికి వెళ్లాలంట. కార్తీకేయుడు లేదా జంటనాగుల విగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో.. అక్కడ పాలతో, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో అభిషేకం చేయాలంట.
కార్తీకేయుడు తల్లిదండ్రులు శివపార్వతులు, గణపయ్యలను పూజించిన కూడా.. కార్తీకేయుడు మనుషుల దోషాల్ని పొగొడుతారని చెబుతుంటారు. ఈరోజున రావి చెట్టు లేదా బిల్వపత్రి చెట్టు కింద దీపాలు వెలిగించాలని చెబుతుంటారు. కార్తీకేయుడు అనుగ్రహాం కోసం.. నవనాగ స్తోత్రాలు, కార్తీకేయ స్తోత్రాలు వంటివి చదవాలని పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter