Solar and Lunar Eclipses In 2024: 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడబోయే సూర్య, చంద్ర గ్రహణాలు ఇవే..సూతకకాల వివరాలు..

Solar and Lunar Eclipses Worldwide In 2024: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రాబోయే సంవత్సరంలో ఏయే తేదిల్లో గ్రహాణాలు ఏర్పడబోతున్నాయో..గ్రహణాలకు సంబంధించి సూతకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2023, 01:06 PM IST
Solar and Lunar Eclipses In 2024: 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడబోయే సూర్య, చంద్ర గ్రహణాలు ఇవే..సూతకకాల వివరాలు..

 

Solar and Lunar Eclipses Worldwide In 2024: 2024 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరంలో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. అయితే మార్చిలో హోలీ పండగ రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. వచ్చే సంవత్సరంలో ఏర్పడబోయే చంద్ర గ్రహణం సంబంధించిన సూతక కాలం విషయానికొస్తే..జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం చంద్ర గ్రహణం కారణంగా ఏర్పడబోయే సూతకకాలం చెల్లుబాటు కాదని తెలిపారు. కాబట్టి ఈ గ్రహణానికి అంత ప్రాముఖ్యత ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుంచి మధ్యాహ్నం 03:01 వరకు కొనసాగుతుంది. అయితే ఈ రాబోయే చంద్రగ్రహాణానికి సంబంధించిన మరిన్ని వివరాలు..2024 సంవత్సరంలో జరగబోయే 4 గ్రహణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2024 సంవత్సరంలో జరగబోయే 4 గ్రహణాలు ఇవే:
1. మొదటి చంద్రగ్రహణం 2024 సంవత్సరంలో మార్చి 25, సోమవారం ఏర్పడబోతోంది. ఏర్పడబోయే చంద్రగ్రహణం సోమవారం రోజు వస్తోంది. కాబట్టి ఈ గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్య కలిగి ఉంది. ప్రతి చంద్రగ్రహణం పూర్ణిమ తిథి రోజు మాత్రమే ఏర్పడుతుంది.

2. 2024 సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం ఏర్పడబోతోంది . చంద్రగ్రహణం ఏర్పడిన 14 రోజుల తర్వాత ఈ గ్రహణం సంభవించబోతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఇదే, కాబట్టి ఈ గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్య కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 08, సోమవారం జరబోతోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

3. 2024 సంవత్సరంలో వచ్చే మూడవ గ్రహణం చంద్ర గ్రహణం సంభవించబోతోంది. ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 బుధవారం రోజు ఏర్పడబోతోంది. సంభవించబోయే చంద్రగ్రహణం  పాక్షికంగా ఏర్పడబోతోంది. కాబట్టి ఈ గ్రహణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

4. 2024 సంవత్సరంలో చివరి, నాలుగవ గ్రహణం సూర్యగ్రహణం. ఈ గ్రహణం అక్టోబర్ 2న బుధవారం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం కూడా చంద్రగ్రహణం ఏర్పడిన 14 రోజుల తర్వాత సంభవించబోతోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News