Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ..? ఆ రాశులకు అనుకూలం, ఈ రాశులకు ప్రతికూలం

Solar Eclipse 2022: సూర్య గ్రహణం ఈ నెలలో రానుంది. జ్యోతిషం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహణం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2022, 11:06 AM IST
  • ఏప్రిల్ 30 న తొలి సూర్య గ్రహణం
  • అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల్నించి ఉదయం 4 గంటల 8 నిమిషాల వరకూ
  • వృషభం, కర్కాటకం, ధనస్సు రాశులవారికి లబ్ది
Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎక్కడ..? ఆ రాశులకు అనుకూలం, ఈ రాశులకు ప్రతికూలం

Solar Eclipse 2022: సూర్య గ్రహణం ఈ నెలలో రానుంది. జ్యోతిషం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహణం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ ఏడాది అంటే 2022లో మొత్తం 4  గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో 2 సూర్య గ్రహణాలైతే..మరో రెండు చంద్ర గ్రహణాలు. 2022లో ఏర్పడనున్న గ్రహణాల్లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో ఉంటుంది. ఈ ఏడాది తొలి గ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనుంది. జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం ప్రభావం చాలా ఎక్కువే. 

సూర్య గ్రహణం సమయం

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 అర్ధరాత్రి ప్రారంభం కానుంది. సూర్య గ్రహణం అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై..ఉదయం 4 గంటల 8 నిమిషాల వరకూ ఉంటుంది. ఈ గ్రహణం ఇండియాలో కన్పించదు. దక్షిణ అమెరికాలోని సౌత్ వెస్ట్ ప్రాంతం, అట్లాంటిక్, ఆంటార్కిటిక్, పసిఫిక్ మహా సముద్రంలో కన్పిస్తుంది. 

సూర్య గ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది

మతం, జ్యోతిష్య శాస్త్రాల్లో గ్రహణాల ప్రభావం మంచిది కాదనే ఉంటుంది. అందుకే సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో ఏ విధమైన శుభప్రదమైన పనులు చేయరు. ఈ సమయంలో తినడం, తాగడం కూడా చేయరు. గ్రహణ సమయంలో ఆలయాలు కూడా మూసివేస్తుంటారు. అంతేకాకుండా సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుందనేది ఓ నమ్మకం. గ్రహణం కన్పించినా కన్పించకపోయినా ఆ ప్రభావం ఉంటుందని అంటారు. ఏప్రిల్ 30న ఏర్పడనున్న గ్రహణం ప్రభావం కూడా అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. కొందరికి అశుభం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, కర్కాటకం, ధనస్సు రాశులకు మాత్రం సూర్య గ్రహణం శుభంగా మారనుంది.

Also read: Solar Eclipse April 2022: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News