2023's First Solar Eclipse: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రామఖ్యత ఎక్కువ. గ్రహణాల సందర్భంగా ఏ విధమైన శుభ కార్యాలు జరపరు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోవడం ఇలా వివిధ రకాల అలవాట్లుంటాయి. ఈ సందర్బంగా ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఎప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
2023 తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ సందర్భంగా ఏం చేయాలి, ఏం చేయకూడదనేది హిందూ జ్యోతిష్యంలో వివరంగా ఉంది. సూర్య గ్రహణం మూడు ప్రత్యేక రూపాల్లో ఏర్పడనుంది. దీనినే వార్షిక, సంపూర్ణ, పాక్షిక గ్రహణాలుగా పిలుస్తారు. సూర్యుడికి ఓ భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్య కాంతిని కొద్దిగా చంద్రుడు నిరోధించగలదు. వార్షిక సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్యలో నేరుగా వచ్చినప్పుడు ఉంటుంది. ఇందులో సూర్యకాంతిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడమే కాకుండా రింగ్ లాంటి పరిణామంలో వెలుతురు వదులుతుంది.
సూర్య గ్రహణం తేదీ.. సమయం వివరాలు..
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసగా వచ్చినప్పుడు భూమిలోని ఓ భాగం చీకటిమయమౌతుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీ గురువారం ఏర్పడనుంది. ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 12.29 గంటల వరకూ ఉంటుంది.
సూర్య గ్రహణంలో జాగ్రత్తలు
1. సూర్య గ్రహణం సందర్భంగా పడుకోకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రత్యేకించి వృద్ధులు, రోగులకు ఇది వర్తిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒకరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
Also Read: Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు... ఇందులో మీరున్నారా?
2. సూర్య గ్రహణం సమయంలో వండటం లేదా తినడం చేయకూడదంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నమ్మకం.
3. గర్భం దాల్చిన మహిళలు సూర్య గ్రహణం వీక్షించకూడదు. బయటకు వెళ్లకూడదు. ఏ విధమైన పని చేస్తుండకూడదు. వీలైతే ఆధ్యాత్మికంగా గడపాలి.4. సూర్య గ్రహణం సమయంలో దేవాలయాలకు వెళ్లి దర్శనం, పూజలు చేయకూడదు. అందుకే ఆ సమయంలో దేవాలయాలు మూసివేస్తుంటారు. ఆ సమయంలో ఇళ్లలో ఎవరికివారు ప్రార్ధన జరుపుకుంటారు.
సూర్య గ్రహణానికి రెండ్రోజుల ముందే సూర్యుడి రాశుల్ని మారుస్తాడు. గురుగ్రహం సూర్య గ్రహణం సందర్భంగా భూమిని క్రాస్ అవడం జరుగుతుంది. ఇండియాలో సూర్య గ్రహణం కన్పించనందున సూతకకాలం వర్తించదు.
Also Read: Sun transit 2023: సూర్యుడి గోచారం ప్రభావం, ఏప్రిల్ 14 నుంచి ఆ 5 రాశులకు మహర్దశ పట్టనుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook