Solar Eclipse In 2023: హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసా?, దీని ప్రత్యేకత ఇదే!

Hybrid Solar Eclipse In 2023: ఈ సంవత్సరం ఏర్పడిన సూర్యగ్రహణం హైబ్రిడ్ గ్రహణం.. కాబట్టి దీని ప్రభావం భారత్‌పై లేకపోవడం వల్ల సూతక కాలం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకి హైబ్రిడ్ గ్రహణం అంటే ఏమిటో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 10:56 AM IST
Solar Eclipse In 2023: హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసా?, దీని ప్రత్యేకత ఇదే!

Hybrid Solar Eclipse In 2023: 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడింది. వాటిలో రెండు సూర్యగ్రహణాలైతే.. మిగిలిన రెండు చంద్ర గ్రహణాలు. అయితే ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణం శతాబ్దంలో ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ గ్రహణం ఏర్పడింది. దీంతో నిపుణులు ఈ సూర్యగ్రహణాన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణంగా పేర్కొన్నారు. హైబ్రిడ్ సూర్యగ్రహణం ఎలా ఉంటుందో, ఎలా కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటే ఏమిటో మీకు తెలుసా?:
సూర్యుడు, భూమి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో  చంద్రుని నీడ భూమిపై పడి భూమి చీకటిగా మారుతాయి. అయితే గ్రహణం ఏర్పడే పద్ధతులు చాలా ఉన్నాయి. కొన్ని గ్రహణాలు పాక్షికంగా ఏర్పడితే మరికొన్ని పూర్తి గ్రహణాలుగా సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. హైబ్రిడ్ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుని బాహ్య రూపం కనిపిస్తుంది. హైబ్రిడ్ సూర్యగ్రహణంలో అన్ని గ్రహణాల్లా కాకుండా చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు.

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

సూర్యగ్రహణం ఈ రోజు ఎక్కడ కనిపిస్తుంది:
ఏప్రిల్ 20 హైబ్రిడ్ సూర్యగ్రహణం ఆస్ట్రేలియాలో రాత్రి 10:29 నుంచి 10:35 వరకు కనిపిస్తుంది. ఇండోనేషియాలో ఏప్రిల్ 20న రాత్రి 11:23 నుంచి 11:58 వరకు మధ్య కనిపించే అవకాశాలున్నాయి. తూర్పు తైమూర్‌లో రాత్రి 11:19 నుండి 11:22 వరకు కనిపిస్తుంది. భారత్‌పై సూర్యగ్రహణం ప్రభావం లేకపోవడం వల్ల మన దేశంలో కనిపించదు.  

మత విశ్వాసం:
సూర్యగ్రహణానికి ప్రత్యేక మతపరమైన గుర్తింపు ఉంది. సూర్యగ్రహణం కనిపించే దేశాలలో సూతక కాలం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూతక కాలాన్ని అశుభకరమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రజలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే భారత్‌పై హైబ్రిడ్ సూర్యగ్రహణం ప్రభావం పడకపోవడం వల్ల ఎలాంటి సూతక కాలం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News