Somvati Amavasya 2022 Pujan Vidhi: సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత సనాతన ధర్మంలో చెప్పబడింది. అమావాస్య తిథి ప్రతి నెల కృష్ణ పక్షం చివరి తేదీ. అమావాస్య సోమవారం పడితే దానిని సోమవతి అమావాస్య (Somvati Amavasya) అంటారు. వివాహిత స్త్రీలకు సోమవతి అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ రోజున స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం పాటించి పీపుల్ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ అమావాస్య చాలా పవిత్రమైనది మరియు ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య యొక్క తిథి, పూజా విధానం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
2022 సంవత్సరంలో చివరి అమావాస్య ఎప్పుడు?
పంచాగం ప్రకారం, ఈ ఏడాది 2 సోమవతి అమావాస్యలు మాత్రమే వస్తాయి. ఇందులో మొదటి సోమవతి అమావాస్య జనవరి 31న వచ్చంది. రెండవ మరియు చివరి సోమవతి అమావాస్య (Somvati Amavasya 2022) మే 30 న వస్తుంది. వచ్చే ఏడాది సోమవతి అమావాస్య రాదు. అందుకే ఈ సోమవతి అమావాస్య ప్రాధాన్యత మరింత పెరిగింది.
పూజా విధానం:
సోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగానదిలో స్నానం చేయాలి. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసే సంప్రదాయం ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లడం కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం వేసి స్నానం చేయవచ్చు. స్నానం తర్వాత, శుభ్రమైన బట్టలు ధరించి, రాగి పాత్రలో పవిత్ర జలాన్ని తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకులకు తర్పణం మొదలైనవి చేయండి. పెళ్లయిన స్త్రీలు రావి చెట్టుకు పూజలు చేసి, ప్రదక్షిణలు చేస్తారు. పీపల్ (రావి) చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా, ఒక వ్యక్తి యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు భర్త దీర్ఘాయువు పొందుతారని నమ్ముతారు.
Also Read: Rituals After Surya Grahanam: సూర్య గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు
సోమవతి అమావాస్య ప్రాముఖ్యత:
సోమవతి అమావాస్యకు మతపరమైన దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పూజించడం, పూర్వీకులకు నువ్వులు ఇవ్వడం వల్ల పుణ్యం లభిస్తుంది. సాధారణంగా సోమవారం శివపార్వతులను పూజిస్తాం. ఈ రోజున పూజించడం, ఉపవాసం పాటించడం వల్ల దీర్ఘాయుష్షుతో పాటు శుభం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.