Surya Gochar 2023: ఏడాది తర్వాత వృషభరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..

Sun transit 2023: మరో మూడు రోజుల్లో సూర్యభగవానుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని అంటారు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2023, 10:27 AM IST
Surya Gochar 2023: ఏడాది తర్వాత వృషభరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు ఊహించని ఐశ్వర్యం, అదృష్టం..

Surya Gochar 2023 effect: ఆస్ట్రాలజీలో విజయం, గౌరవం మరియు ఆత్మకు కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. ఏడాది తర్వాత సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరించబోతున్నాడు. మే 15 ఉదయం ఉదయం 11.32 గంటలకు ఆదిత్యుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. జాతకంలో సూర్యుడి శుభస్థానంలో ఉంటే మీరు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను అలవరుచుకుంటారు. సూర్యుని సంచారం ఏ రాశుల వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

కన్య రాశి
ఆదిత్యుడి రాశి మార్పు వల్ల మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. 
కుంభ రాశి
కుంభ రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ప్రైవేట్ జాబ్స్ చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. సూర్య సంచారం మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 

Also Read: Shani jayanti 2023: శని జయంతి ఈ 5 రాశుల వారికి స్పెషల్.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

కర్కాటక రాశి
వృషభ రాశిలో సూర్య సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆఫీసులో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
సింహరాశి 
భానుడు సంచారం వల్ల సింహరాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు జాబ్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News