Swastik Symbol Importance: ఇంట్లో గుమ్మంపై లేదా కొత్త వస్తువులపై స్వస్తిక్ గుర్తు ఎందుకుంటుంది, కారణాలు, మహత్యమేంటి

Swastik Symbol Importance: హిందూమతంలో స్వస్తిక్ ముద్రకు విశేష మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. అందుకే ప్రతి ఇంటి గుమ్మంపై స్విస్తిక్ ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ముద్ర ఎందుకుంటుంది, ఆ ముద్ర ప్రాముఖ్యతేంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 30, 2022, 09:27 PM IST
Swastik Symbol Importance: ఇంట్లో గుమ్మంపై లేదా కొత్త వస్తువులపై స్వస్తిక్ గుర్తు ఎందుకుంటుంది, కారణాలు, మహత్యమేంటి

Swastik Symbol Importance: హిందూమతంలో స్వస్తిక్ ముద్రకు విశేష మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. అందుకే ప్రతి ఇంటి గుమ్మంపై స్విస్తిక్ ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ముద్ర ఎందుకుంటుంది, ఆ ముద్ర ప్రాముఖ్యతేంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూమతం ప్రకారం స్వస్తిక్ గుర్తుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఏదైనా ప్రత్యేక శుభకార్యాల సమయంలో కచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చినప్పుడు ఆ వస్తువుపై కూడా స్వస్తిక్ ముద్ర వేయడం ఆనవాయితీ. ఇంట్లో ప్రధాన గుమ్మంపై కూడా స్వస్తిక్ ముద్ర చూస్తుంటాం. దీనివెనుక ఉన్న కారణాలేంటి, ప్రయోజనాలేంటి, ఎందుకీ గుర్తు వేస్తారనేది పరిశీలిద్దాం..

స్వాస్తిక్ అనే పదం సు, అస, వ క అక్షరాలు కలిస్తే వస్తుంది. ఇందులో సు అంటే శుభం అస అంటే అస్థిత్వం, క అంటే కర్త అని అర్ధం. అందుకే ఈ గుర్తుని శుభసూచకంగా భావిస్తారు. హిందూమతం ప్రకారం స్వాస్తిక్‌లో నాలుగు సమాంతర భుజాలుంటాయి.ఇవి నాలుగు దిశలను సూచిస్తాయి. అందుకే హిందూమతంలో స్విస్తిక్ గుర్తుని శుభ కార్యాల సమయంలో వాడుతారు. 

ఇంటి గుమ్మంపై స్వస్తిక్ గుర్తు

హిందూమతం ప్రకారం దాదాపు అందరి ఇళ్ల ప్రధాన గుమ్మంపై స్వస్తిక్ గుర్తు కచ్చితంగా ఉంటుంది. దీనికి శుభసూచకంగా పరిగణిస్తారు. దీనివెనుక ఓ మహత్యం కూడా ఉంది. ఇంటి మఖద్వారంపై స్వస్తిక్ గుర్తు పెట్టడం వల్ల ఏ విధమైన చెడు లేదా నెగెటివ్ శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్మకం. అంతేకాకుండా ఆ ఇంట్లో దుఖం, దారిద్ర్యం ప్రవేశించజాలవని విశ్వాసం. అందుకే ఇంటి గృహప్రవేశం సమయంలో పండితులు తప్పకుండా స్వస్తిక్ గుర్తు గీయిస్తారు. ఇంటి ముఖద్వారంపై పసుపుతోనే ఈ స్వస్తిక్ గుర్తు వేయాల్సి ఉంటుంది. అది కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో గోడపై ఆ గుర్తు ముద్రించాలి. వాస్తు ప్రకారం ఇంట్లోని మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఇలా ఉంటే శుభం జరుగుతుందని అర్ధం. అంతేకాకుండా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ భగవంతుడి కటాక్షం ఉంటుందని అర్ధం.

Also read: Janmashtami 2022: ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే.. శ్రీ కృష్ణుడికి ఈ చిన్న వస్తువును సమర్పించండి చాలు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News