24 Carat Gold Rate is above 55 Thousand on 2nd January 2023: దేశీయ మార్కెట్‌లో ప్రతిరోజు బంగారం, వెండి ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. ఇంకొన్ని రోజులు మాత్రం స్థిరంగా ఉంటాయి. నిత్యం బంగారం, వెండి ధరలలో మార్పులు చోటుచేసుకోవడానికి కారణం... పలు దేశ భౌగోళిక పరిస్థితులు, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వ. ఏదేమైనా బంగారం వ్యాపారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది.
సోమవారం (జనవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 50,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,220లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,350గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,200గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,960 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,650లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,220గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,200గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,200గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,600.. 24 క్యారెట్ల ధర రూ. 55,200గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 50,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,200 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. సోమవారం (జనవరి 2) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 71,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,300లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,300గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,300ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం జగన్
Also Read: Vidadala Rajani: అరకేజీ నూనె, కందిపప్పు, చీర ఇస్తామని చెప్పి ప్రాణాలు తీశారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.