Mercury Transit 2024: మీన రాశిలోకి బుధుడు.. మార్చి 07 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Mercury Transit 2024: వచ్చే నెలలో బుధుడు మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. దీని కారణంగా రాహువు బుధుడు కలయిక సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారు భారీ ప్రయోజనాలు పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2024, 04:19 PM IST
Mercury Transit 2024: మీన రాశిలోకి బుధుడు.. మార్చి 07 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Budh Rahu Gochar 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. మార్చి నెలలో కూడా చాలా గ్రహాలు తమ కదలికలను ఛేంజ్ చేస్తున్నాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడు మార్చి 07న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దీంతో మీనరాశిలో బుధుడు మరియు రాహువు సంయోగం జరగబోతుంది. వీరిద్దరి కలయిక మార్చి 25 వరకు ఉంటుంది. దీంతో మూడు రాశులవారు బోలెడు ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కుంభ రాశి
రాహు మరియు బుధుడు కలయిక కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మీరు ఆర్థికంగా మునుపటి కంటే మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి, మంచి డైట్ ఫాలోవ్వండి.  బయట పుడ్ అస్సలు తినొద్దు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
వృషభం
బుధుడి సంచారం వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు పాత వ్యాధుల నుండి బయటపడతారు. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. మీరు ఎవరి వద్దనుండైనా అప్పు తీసుకుంటే దానిని తిరిగి చెల్లిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
తులారాశి
మీనరాశిలో బుధుడు సంచారం తులారాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ప్రసంశలకు దక్కుతాయి, అంతేకాకుండా ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.

Also Read: Astrology: 12 ఏళ్ల తర్వాత 'గజలక్ష్మి యోగం'.. ఈ 3 రాశులవారికి వరం..

Also Read: Sarpa Ring:పెళ్లి ఆలస్యమౌతుందా..?.. ఈ ఉంగరం వేసుకుంటే మీ సుడి తిరిగినట్లే.. జ్యోతిష్యుల సూచనలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News