2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!

Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందవచ్చు? ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోండి..

Written by - Shashi Maheshwarapu | Last Updated : Jul 12, 2024, 10:19 AM IST
2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!

Mercury transit 2024: బుధుడు మేధస్సు,  కమ్యూనికేషన్ నైపుణ్యాలు, గణిత సామర్థ్యం, తెలివితేటలు, స్నేహం వంటి అంశాలను ప్రభావితం చేసే గ్రహం. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని "గ్రహాల రాకుమారుడు" అని పిలుస్తారు. బుధుడు చాలా చురుకైన గ్రహం, రాశుల మధ్య వేగంగా సంచరిస్తుంది. ఇతర గ్రహాలతో పోలిస్తే చాలా తక్కువ సమయం పాటు ఒకే రాశిలో ఉంటుంది. ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 19న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యశాస్త్రనిపుణులు చెబుతున్నారు. 

Add Zee News as a Preferred Source

బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఈ కాలంలో అదృష్టం, విజయం, శ్రేయస్సు లభిస్తాయి. కోరిన కోరికలు కూడా తీరుతాయి. అయితే ఈ రాశిలలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.. 

వృషభ రాశి: 

వృషభ రాశిలో జ్మనించిన వారికి ఈ  సమయంలో ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు రావచ్చు, ఉద్యోగ పురోగతి సాధ్యమవుతుంది, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో పనివారు విదేశాలలో పని చేయడానికి ఆఫర్లు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. పూర్తి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని సమయాల్లో ఎక్కువ లాభాలు పొందుతారు. పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అడ్డంకులు తొలగి, కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధన సంపద పెరుగుతుంది. ఉద్యోగాలలో అడ్డంకులు తొలగి, పురోగతి సాధ్యమవుతుంది. కొత్త అవకాశాలు పొందుతారు. సంపద పెరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వివాహితులకు సంతోషకరమైన సమయం. కుటుంబ సభ్యులతో మధుర సంబంధాలు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

కన్యా రాశి:

కన్యా రాశికి ఈ సంచారం వల్ల అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. కొత్త అవకాశాలు రావడం, పదోన్నతులు లభించడం వంటివి జరుగుతాయి.  వ్యాపారాలు వృద్ధి చెందడానికి, లాభాలు పెరగడానికి అనుకూల సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. అనుకోకుండా డబ్బు లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు లభించడం, లేదా ఇప్పటికే ఉన్న వనరుల ద్వారా ఆదాయం పెరగడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. బుధగ్రహం సోత్రం పటించడం వల్ల ఆరోగ్యం మరింత బాగుటుంది. బుధిగ్రహంకు ధానం చేయడం గొప్ప ఫలితాలు పొందుతారు.

ధనుస్సు రాశి: 

ఈ నెలలో ధనుస్సు రాశి వారికి సామాజికంగా గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారాలకు అనుకూల సమయం. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో పనితీరు మెరుగుపడి, పదోన్నతి, వేతన పెంపు పొందే అవకాశం ఉంది.
వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రమ చేయడం మంచిది. ఆహార విషయం పట్ల జాగ్రత్తలు వహించాలి. ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

గమనిక:

ఈ అంచనాలు సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఖచ్చితమైన ఫలితాలు  మరింత సమాచారం కోసం సంబంధిత జ్యోతిషశాస్త్ర నిపుణుడిని సంప్రదించండి. వారు పరిహారాలు, గ్రహశాంతి వంటి సూచనలను చేస్తారు. ఈ కథనంలోని సమాచరంతో Zee Telugu Newsకి ఎలాంటి సంబంధం లేదు. 
 

 

 

 

 

 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News