Tree Worship Remedies: హిందూమతంలో దేవీదేవతల పూజలతో పాటు చెట్లు, మొక్కల పూజకు కూడా విశేష మహత్యముంటుంది. కొన్ని చెట్లలో దేవతలు ఆవాసముంటారని ప్రతీతి. అందుకే ఆ చెట్లను పూజిస్తే కొన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు, మొక్కల పూజలకు అధిక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. కొన్ని చెట్లను పూజించడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. ఏ చెట్లను పూజించాలి, ఏ కోర్కెలు నెరవేరుతాయో తెలుసుకుందాం. అయితే క్రమం తప్పకుండా నిర్ణీత పద్ధతిలో పూజించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని చెట్లపై దేవతలు ఆవాసముంటారని ప్రతీతి.
అశోక చెట్లకు హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఎవరైనా రోగాలతో లేదా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉంటే అశోక చెట్టుకు పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల రోగాలన్నీ దూరమౌతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలుంటాయి. ప్రత్యేకమైన కోర్కెలు నెరవేరుతాయి. ఇక రెండవది అరటి చెట్లు. హిందూమతంలో అరటి చెట్లను విష్ణువు ఆవాసంగా భావిస్తారు. కుండలిలో గురుదోషముండే వ్యక్తులు అరటి చెట్ల పూజలు చేయాలి. అరటి చెట్లను పూజించడం వల్ల ఆ వ్యక్తికి వివాహ యోగం వస్తుంది. అంతేకాకుండా..సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.
ఎర్రచందనం చెట్లకు కూడా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం విశేష ప్రాధాన్యత ఉంది. కుండలిలో సూర్య గ్రహానికి చెందిన గ్రహదోషముంటే అది దూరం చేసేందుకు ఎర్రచందనం చెట్టును పూజించాలి. ఎర్ర చందనం చెట్లను పూజించడం వల్ల ప్రమోషన్లు సులభమౌతాయి. ఇక నాలుగవది షమీ చెట్లు. ఈ చెట్లకు జ్యోతిష్యశాస్త్రంలో అమితమైన ప్రాధాన్యత ఉంది. ఈ చెట్లు శివుడికి ఆవాసంగా భావిస్తారు. షమీ చెట్లు శనిదేవుడికి కూడా ఇష్టమైనవి. కోర్టు సంబంధిత వివాదాల్లో విజయం సాధించేందుకు, శత్రువులపై గెలిచేందుకు క్రమం తప్పకుండా షమీ చెట్లను పూజించాలి. దసరా రోజుల్లో ఈ చెట్లకు అధికంగా పూజలు చేస్తుంటారు.
ఇక దానిమ్మ మొక్కలకు విశేష ప్రాధాన్యత ఉంది. దానిమ్మతో ఇంట్లోని నెగెటివ్ శక్తిని దూరం చేయడమే కాకుండా పాజిటివ్ శక్తి ప్రసరించేందుకు దోహదమౌతుంది. దాంతోపాటు దానిమ్మలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
Also read: Tulsi Plant Remedies: తులసి మొక్కకు నీళ్లతో పాటు కొద్దిగా అది కలిపితే..ఇక అంతులేని సంపద మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook