Tirumala : ఏడుకొండల శ్రీనివాసుడు కొలువై ఉన్న గోవిందరాజపట్నం అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు తిరుపతి మహానగరంగా మారింది. ఈనెల 24వ తేదీకి తిరుపతి ఆవిర్భవించి ఎనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే మనుషులు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే తరహాలోనే తిరుపతికి కూడా తన 894 వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనుంది.
హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి అయిన వైకుంఠ క్షేత్రం తిరుపతి. 9 శతాబ్దాల నుంచి ఎందరో భక్తులు తీర్థయాత్రకు వెళుతున్న ఈ తిరుపతి ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి పూనుకున్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇదే విషయాన్ని మీడియాకి కూడా తెలియజేశారు.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే తిరుపతి 894వ పుట్టినరోజు వేడుకల కోసం ఆయనే స్వయంగా ఒక మంచి పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యంత పవిత్రమైన తిరుపతి నగరం ఒకప్పుడు గోవిందరాజపట్నం గా చలామణి అయ్యేదని.. అదే ఇప్పుడు తిరుపతి గా మారింది అని ఆయన గుర్తు చేశారు.
కాగా తిరుపతి నగరవాసులు అందరూ కలిసి కట్టుగా ఈ పుట్టినరోజు పండుగ చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి ఆలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ పండుగ మొదలు అవుతుంది అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలియజేశారు.
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు స్వయంభులుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో తిరుపతి కూడా ఒకటి. 1130వ సంవత్సరం లో ఫిబ్రవరి 24న కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని రామానుజాచార్యుల వారు ఏర్పాటు చేశారు. 894 ఏళ్ల క్రితం సౌమ్య నామ సంవత్సరం లో ఫాల్గుణ పౌర్ణమి ఉత్తర నక్షత్రం లో సోమవారం నాడు తిరుపతి నగరం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలసింది. వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేయడం తో పాటు తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఘనంగా జరపనున్నారు.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook