Tuesday Hanuman Puja: శని సాడే సాతి దుష్ప్రభావాలతో బాధపడుతున్నారా? శుక్లపక్షంలో ఇలా హనుమంతుడికి పూజ చేయండి!

Tuesday Hanuman Puja Vidhi: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమంతుని వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ క్రింది జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఈ పూజా నియమాలు పాటించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2023, 08:22 PM IST
Tuesday Hanuman Puja: శని సాడే సాతి దుష్ప్రభావాలతో బాధపడుతున్నారా? శుక్లపక్షంలో ఇలా హనుమంతుడికి పూజ చేయండి!

Tuesday Hanuman Puja Vidhi: శుక్లపక్షంలోని వచ్చే మొదటి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ మంగళవారం హనుమంతుడికి పూజా కార్యక్రమాలతో పాటు ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో అన్ని రకాల బాధలు, శని సాడే సాతి దూరమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మొదటి మంగళవారం రోజున హనుమంతుని పూజలో పాల్గొని ఉపవాసం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

హనుమంతుడికి తమలపాకుల దండ అంటే ఎంతో ప్రీతికరం. కాబట్టి మొదటి మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకులతో తయారుచేసిన దండను సమర్పించి.. వడతో చేసిన ఆహార పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా పూజలో భాగంగా సుందరకాండను పాటించిన వారికి భయము క్రోధము నశిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆంజనేయుడికి శుక్లపక్షంలోని మంగళవారం ఉపవాసాలతో పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శని సాడే సాతి వల్ల కలిగే దుష్ప్రభావాలు దూరం అవుతాయి. అంతేకాకుండా చాలామంది రాత్రి పీడకలలతో భయపడుతూ ఉంటారు. ఇలా భయపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సంతానం లేని సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా సంతానం లభిస్తుంది. వివాహంలో జాప్యం జరిగితే ఈ ఉపవాసం పాటించడం వల్ల మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో కష్టాలన్నీ దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు పేర్కొన్నారు. 

శుక్లపక్షంలోని మొదటి మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు:
శుక్లపక్షంలోని మొదటి మంగళవారం ఆంజనేయుడికి పూజా కార్యక్రమాలు చేసేవారు తప్పకుండా ఈ క్రింది నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం ఉపవాసం ఉండేవారు జుట్టు, గోర్లను అస్సలు కత్తిరించకూడదు. అంతేకాకుండా మాంసం కలిగిన ఆహారాలను కూడా అసలు తినవద్దని జ్యోతిష్య శాస్త్రాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్రతం పాటించేవారు నలుపు రంగుతో కూడిన దుస్తులను ధరించడం మంచిది కాదు. అంతేకాకుండా ఈరోజు ఉప్పును కూడా దానం చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొన్నారు.

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News