Tulsi Vastu tips: ఇంట్లో తులసి మెుక్కను ఈ దిశలో నాటితే.. కష్టాలు తెచ్చుకున్నట్లే..!

Vastu Tips: హిందూమతంలో తులసి మెుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం, తులసి మొక్కను సరైన దిశలో నాటడం చాలా ముఖ్యం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 06:52 PM IST
  • హిందువులు తులసి మెుక్కను పవిత్రంగా భావిస్తారు
  • దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది
Tulsi Vastu tips: ఇంట్లో తులసి మెుక్కను ఈ దిశలో నాటితే.. కష్టాలు తెచ్చుకున్నట్లే..!

Tulsi Vastu tips: హిందూమతంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. తులసి మెుక్కలో (Tulsi Plant) లక్ష్మీదేవి మరియు విష్ణువు నివశిస్తారని నమ్ముతారు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది. సంపద కూడా వృద్ధి చెందుతుంది. తులసి మెుక్కను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నాటకూడదు. ఇలా నాటడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి. అందుకే తులసి మెుక్కను  సరైన దిశలో నాటాలి. తులసి మొక్కను నాటేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. 

తులసి మొక్కను ఇంట్లో ఏ దిక్కున నాటాలి
తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటి ప్రాంగణంలోని తూర్పు దిశలో నాటాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది.  ఈశాన్య లేదా ఉత్తర దిశలో కూడా తులసి మొక్కను కూడా నాటవచ్చు. ఈ దిశలో తులసి మొక్కను నాటడం ద్వారా ఇంట్లో  పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అంతేకాకుండా లక్ష్మీ దేవి మరియు విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. 

తులసి మొక్కను ఏ దిక్కున నాటకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి దక్షిణ దిశలో తులసి మొక్కను నాటడం చాలా అశుభంగా భావిస్తారు. దక్షిణ దిశ పూర్వీకులకు సంబంధించినదని నమ్ముతారు. కాబట్టి తులసి మొక్కను ఈ దిశలో నాటడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. 

Also Read: Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి రోజునే శుభ యోగం.. విష్ణువును ఇలా పూజిస్తే మీకు డబ్బే డబ్బు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News