Vastu for Lakshmidevi: లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో కోరుకుంటున్నారా..అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి

Vastu for Lakshmidevi: హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. లక్ష్మీదేవి కరుణ ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు, సంపద వస్తాయి. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఆవాసముండాలంటే..ఏం చేయాలి, ఇళ్లు ఎలా శుభ్రం చేసుకోవాలో వాస్తుశాస్త్రం వివరిస్తోంది

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2022, 11:45 PM IST
Vastu for Lakshmidevi: లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో కోరుకుంటున్నారా..అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి

Vastu for Lakshmidevi: హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. లక్ష్మీదేవి కరుణ ఉంటేనే ఇంట్లో సుఖశాంతులు, సంపద వస్తాయి. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఆవాసముండాలంటే..ఏం చేయాలి, ఇళ్లు ఎలా శుభ్రం చేసుకోవాలో వాస్తుశాస్త్రం వివరిస్తోంది

లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికీ అవసరమే. ప్రతి ఒక్కరూ ఇంట్లో ధనం, ఐశ్వర్యం, సుఖ శాంతులు అన్నీ ఉండాలని కోరుకుంటారు. అన్నీ అనుకున్నట్టు  జరగాలంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తేనే సాద్యమౌతుంది. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు..ఇంట్లో ప్రవేశించేలా చేసేందుకు ఆమెకిష్టమైన పనులు చేయాలంటున్నారు వాస్తు పండితులు. 

ముఖ్యంగా లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఇష్టం. అంటే ఏ ఇంట్లోకైనా ఆమె ప్రవేశించాలంటే ముందుగా ఆ ఇళ్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో సభ్యులు పనులు సక్రమంగా పద్ధతిగా ఉండాలి. క్రమశిక్షణగా ఉండాలి. అలాంటి ఇళ్లుంటేనే లక్ష్మీదేవి ఆవాసం ఉంటుందట. అందుకే ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో, ఎప్పుడు ఏం చేయాలో, చేయకూడదో, ఎక్కడ ఏం ఉంచాలో వాస్తుశాస్త్రం వివరిస్తోంది. 

వాస్తుశాస్త్రంలో ఏ గదిని ఏదిశలో అమర్చాలో చెప్పడమే కాకుండా..అందులో సామాన్లను ఎక్కడెక్కడ పెట్టాలి, దాని వల్ల కలిగే లాభాలేంటనేది కూడా ఉంది. దాంతోపాటు ముఖ్యమైన పనులు చేసే సముహూర్తాల గురించి కూడా వివరించారు. తద్వారా ఇంట్లో పాజిటివ్ శక్తులు కదలాడుతాయి. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో దరి చేరదు. దీనికోసం ముఖ్యంగా ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలి. అంతేకాదు.ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కూడా వాస్తు శాక్త్రం వివరించారు.

వాస్తుశాస్త్రం ప్రకారం ఒకవేళ ఇళ్లు శుభ్రంగా ఉంచుకుంటే..లక్ష్మీదేవి ప్రసన్నమై..ఇంటిని సంపదతో వర్ధిల్లేలా చేస్తుందట. ఇంట్లో కుటుంబసభ్యులు తమ తమ పనుల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు, సంపద వృద్ధి చెందే ఆ పద్ధతులేంటో చూద్దాం..

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ప్రధాన గుమ్మం నుంచి మొత్తం ఇంటిని శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇళ్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికొస్తుందని గుర్తుంచుకోండి.

Also read: Curd-Lemon Tips: మృదువైన చర్మం, మచ్చల్లేని ముఖం కోసం ఇలా చేస్తే చాలు..ఏ బ్యుటీషియన్ అవసరం లేదు

ఇళ్లు ఎప్పుడు తుడవకూడదు

ఇంటిని శుభ్రం చేసే సమయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో చీపురుతో తుడవకూడదు. ఇది కాకుండా సూర్యస్తమయం తరువాత కూడా శుభ్రం చేయకూడదు. వాస్తవానికి ఈ సమయాలు లక్ష్మీదేవి ఇంటికొచ్చే సమయం. అందుకే అటువంటి సమయంలో ఇంట్లో చీపురు వాడకూడదు. ఇళ్లు శుభ్రం చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో శుభ్రం చేయాల్సివస్తే..ఆ చెత్తను బయటపాడేయకూడదు. 

ఇంట్లో ప్రతి మూలన, ఫర్నీచర్ కింద, కన్పించని అన్ని ప్రదేశాల్లో ఎప్పుడూ శుభ్రం చేస్తుండాలి. ఎందుకంటే ఇంటి మూలల్లోనే దేవతలు ఆవాసముంటారట. కేవలం ఇంటిని శుభ్రం చేయడమే కాదు..ఇంట్లో అన్ని బాత్రూమ్స్, పైకప్పు, బాల్కనీలు కూడా శుభ్రపరుస్తుండాలి. బాత్రూమ్‌లో దుర్గంధం రాహవును వికటించేలా చేస్తుంది. వికటించిన రాహువు జీవితంలో ఎన్నో కష్టాలకు కారణమౌతాడు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా ఆగ్రహానికి లోనవుతుంది. ఇంట్లో అపరిశుభ్రత కారణంగా వాస్తుదోషం కాకూడదు. అన్నీ సక్రమంగా ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. 

Also read: Astro Remedies: ఆర్ధికంగా చితికిపోయున్నారా..రూపాయి నాణెంతో ఇలా చేస్తే చాలు, అదృష్టం మారిపోతుంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News