Broom Vastu Tips: ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా ఉంచాలి, లేకపోతే ఏం జరుగుతుంది?

Broom Vastu Tips: వాస్తుశాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. దాంతోపాటు ఇంట్లో చీపురు విషయంలో కొన్ని నియమాలు కూడా ప్రస్తావన ఉంది. ఈ నియమాల్ని పాటించకపోతే..ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందట..  

Last Updated : Jun 8, 2022, 05:20 PM IST
Broom Vastu Tips: ఇంట్లో చీపురు ఎక్కడ, ఎలా ఉంచాలి, లేకపోతే ఏం జరుగుతుంది?

Broom Vastu Tips: వాస్తుశాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. దాంతోపాటు ఇంట్లో చీపురు విషయంలో కొన్ని నియమాలు కూడా ప్రస్తావన ఉంది. ఈ నియమాల్ని పాటించకపోతే..ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందట..

ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు తన ప్రభావం చూపిస్తుంటుంది. ఈ ప్రభావం పాజిటివ్ లేదా నెగెటివ్ ఏమైనా కావచ్చు. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఇళ్లంతా సంపదతో నిండిపోవాలని ఆశిస్తాడు. కానీ చాలాసార్లు అన్ని విషయాల్ని ఆలోచించి చేస్తూనే..అనుకున్నవి సాధించలేకపోతాడు. వాస్తుదోషమే దీనికి కారణమని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని విషయాల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. 

వాస్తుశాస్త్రంలో చీపురు విషయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో చీపురు ఉంచే విషయంలో కొన్ని నియమాలున్నాయి. ఈ నియమాల్ని ఒకవేళ పాటించకపోతే..లక్ష్మీదేవి ఆ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. దాంతోపాటే ఆ వ్యక్తికి దారిద్య్రం ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ నియమాలేంటో పరిశీలిద్దాం..

వాస్తు ప్రకారం దృష్టిలో ఉంచుకోవల్సి విషయాలు

వాస్తు ప్రకారం చీపురుని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు. నిలబెట్టి ఉంచే చీపురు అశుభంగా భావిస్తారు. అందుకే చీపురును ఎప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి. చీపురును ఎప్పుడూ కిచెన్ లో ఉంచకూడదంట. కిచెన్‌లో చీపురుంచడం వల్ల ఇంట్లో అన్నం కొరత ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. దాంతో పాటు ఇంటి కుటుంబసభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. 

వాస్తు పండితుల ప్రకారం..ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలి. బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు. అందరి దృష్టీ అటే వెళ్తుంది. ఇతరుల దృష్టి పడనిచోట ఇంట్లో చీపురు ఉంచాలంటారు. బహిరంగంగా ఉంచితే ఆ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆ చీపురు దూరం చేస్తుందట.

చీపురు పాడైతే వెంటనే కొత్తది మార్చేయాలి. పాడైన చీపురుతో ఇళ్లు శుభ్రం చేస్తే..చాలా సమస్యలు ఎదురౌతాయి. దీనివల్ల ఆ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. పాత చీపురును తీసేసి..శనివారం నాడు ఇంట్లోకి కొత్త చీపురు తెచ్చుకోవాలి. 

వాస్తు పండితుల ప్రకారం చీపురు ఎప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ దారిద్య్రం తాండవించదు. ఇంట్లో ఆనందం వర్ధిల్లుతుంది. చీపురును లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు. సాయంత్రం సమయంలో చీపురుతో తుడిస్తే..లక్ష్మీదేవికి అలుగుతుందంటారు. సూర్యాస్తమయం తరువాత ఏదైనా కారణంతో చీపురుతో తుడవాల్సి వస్తే..మట్టి, చెత్తను ఇంట్లోనే ఉంచుకోవాలి. బయట పారవేయకూడదు. లేకపోతే లక్ష్మీదేవి వెళ్లిపోతుందని అంటారు. 

చీపురును నార్త్‌ఈస్ట్‌లో పొరపాటున కూడా ఉంచకూడదు. లేకపోతే..ఇంట్లోకి సంపద రాదంట. అందుకే చీపురుని పశ్చిమం లేదా దక్షిణ దిశలోనే ఉంచాలి.

Also read; Astrology: ఆ ఐదు రాశుల జాతకంలో ఏముంది ? వ్యాపారంలో అంతులేని డబ్బు సంపాదిస్తారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News