Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున ఫ్రీగా తీసుకుంటే అంతే సంగతి..జీవితాంతం పేదరికంలో బతకాల్సిందే..

Vastu Tips: వాస్తు శాస్త్రంలో మానవ సంబంధమైన అనేక రకాల విషయాలను పేర్కొన్నారు. ముఖ్యంగా జీవితంలో చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో ఈ శాస్త్రం క్లుప్తంగా వివరిస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఫ్రీగా తీసుకోవడం మంచిది కాదని తెలుస్తోంది. ఆ వస్తువులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 09:16 PM IST
 Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున ఫ్రీగా తీసుకుంటే అంతే సంగతి..జీవితాంతం పేదరికంలో బతకాల్సిందే..

 

Vastu Tips: పూర్వికుల నుంచి వస్తున్న శాస్త్రాల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. ఈ శాస్త్రంలో మనుషులు ఎలా జీవించాలో అనేది ఎంతో క్లుప్తంగా పేర్కొన్నారు.  వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ప్రతిరోజు పనులు చేయడం వల్ల జీవితం ఆనందంగా, సంతోషంగాను, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. శాస్త్రానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేసిన నెగిటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క పనిని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ప్రకారం.. కొన్ని వస్తువులను ఎవరి నుంచి కూడా ఉచితంగా తీసుకోకూడదని రూల్ ఉంది.

ఒకవేళ ఆ వస్తువులను తీసుకుంటే అనారోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక ఇబ్బందులు సైతం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇంతకీ ఆ వస్తువులేంటో? వాస్తు శాస్త్రంలో ఆ వస్తువుల గురించి ఏ విధంగా పేర్కొన్నారో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం తో పాటు వాస్తు శాస్త్రంలో ఉప్పును శని దేవుడిగా భావిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు ఉప్పును ఉచితంగా తీసుకోకూడదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు ఉప్పును ఫ్రీగా తీసుకోవడం వల్ల మానసిక ఇబ్బందులు రావడమే కాకుండా.. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ ఉచితంగా వచ్చిన ఉప్పును వినియోగించకపోవడం చాలా మంచిది. 

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

అలాగే ఇతరుల నుంచి టోపీలను తీసుకోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉచితంగా టోపీలను తీసుకోవడం వల్ల ఇంట్లో గొడవలు రావడమే కాకుండా, అన్నదమ్ముల మధ్య బంధాలు క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఉచితంగా ఎవరు టోపీలను ఇచ్చిన తీసుకోకపోవడం చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇక ఇనుపతో తయారుచేసిన వస్తువులను కూడా తీసుకోకపోవడం చాలా మంచిది. ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఫ్రీగా తీసుకోవడం వల్ల మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి దీంతోపాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

అలాగే ఉచితంగా వచ్చిన నూనెను కూడా వినియోగించడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నూనెను శనిదేవుడి వస్తువుగా భావిస్తారు. కాబట్టి ఉచితంగా వచ్చిన నూనెను వినియోగించడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు పెరిగి పేదరికం కూడా గురవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా వచ్చిన నూనెను వినియోగించకపోవడం చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News