Vat Savitri Vrat 2023: వటసావిత్రీ వ్రతం విశిష్టత, పూజా సమయాలు, శుభ ముహూర్తాలు!

Vat Savitri Vrat 2023 Puja Vidhi: వటసావిత్రీ వ్రతం రోజున స్త్రీలు ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే సమయాల్లో ఈ పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 18, 2023, 03:49 PM IST
Vat Savitri Vrat 2023: వటసావిత్రీ వ్రతం విశిష్టత, పూజా సమయాలు, శుభ ముహూర్తాలు!

Vat Savitri Vrat 2023 Puja Vidhi: వటసావిత్రీ వ్రతం వివాహా స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైనది.. ఈ వ్రతాన్ని ఉపవాసాలతో పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో కలిగే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని చేయడం వల్ల దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వటసావిత్రీ వ్రతం 19 మే శుక్రవారం వస్తోంది. అయితే ఈ రోజు స్త్రీలు ఉపవాసాలు పాటించి పూజా మర్రి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్రతంలో భాగంగా స్త్రీలు ఏ సమయంలో పూజా కార్యక్రమాలు చేయాలో, పూజా నియమాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వటసావిత్రీ శుభ సమయం:
ఈ వ్రతాన్ని చేయాలనుకునేవారు మే 18 అమావాస్య తిథి రాత్రి 09:42 గంటల నుంచి మే 19 రాత్రి 09:22 గంటల మధ్య చేయోచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

వటసావిత్రీ ఉపవాసం, పూజా సమయాలు:
✬ చెర కాలం: ఉదయం 05:28 నుంచి 07:11 వరకు..
✬ లవ కాలం: 07:11 నుంచి 08:53 వరకు
✬ అమృత కాలం: ఉత్తమం: 08:53 నుంచి 10:35 వరకు..
✬ శుభ కాలం: 12:18 నుంచి 02:00 సాయంత్రం వరకు.

వటసావిత్రీ పూజా శుభ ముహూర్తాలు:
✽ బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:06నుంచి 04:47 వరకు..
✽ ఉదయం సాయంత్రం: ఉదయం 04:26 నుంచి 05:28 వరకు..
✽ అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు..
✽ విజయ్ ముహూర్తం: మధ్యహ్నం 02:34 నుంచి 03:29 వరకు..
✽ గోధూళికా ముహూర్తం: సాయంత్రం 07:06 నుంచి 07:26 వరకు..

వటసావిత్రీ పూజా విధానం:
వటసావిత్రీ వ్రతం చేసేవారు తప్పకుండా పూజ కోసం ఏడు రకాల ధాన్యాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెదురుతో తయారు చేసిన బుట్టను తీసుకోవాలి. అందులో సావిత్రి దేవి విగ్రహం పెట్టి మర్రి చెట్టు దగ్గర ఉంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మర్రిచెట్టుకు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. శనగ, బెల్లం ప్రసాదంలా సమర్పించాలి.  ఇలా పెళ్లైన స్త్రీలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నేరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News