Shukra Gochar 2022: తులరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ రాశులవారికి పండగే పండుగ..

Shukra Gochar 2022: శుక్రుడు మరో వారం రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 10:05 AM IST
Shukra Gochar 2022: తులరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ రాశులవారికి పండగే పండుగ..

Shukra Gochar 2022: అంతరిక్షంలో గ్రహాల రాశిచక్రం మార్పు చాలా ముఖ్యమైనది. ఇది మానవుని యెుక్క జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. అలాంటి శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న శుక్రుడు అక్టోబరు 18న తులరాశిలో (Venus transit in libra 2022) సంచరించనున్నాడు. తులరాశికి అధిపతి కూడా శుక్రుడు. సొంతరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.

కన్య (Virgo): ఈ రాశి యెుక్క రెండో ఇంట్లోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. దీంతో ఈరాశివారు ఊహించని ధనలాభాన్ని పొందుతారు. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మార్కెటింగ్, లాయర్ లేదా విద్య మొదలైన రంగాలతో సంబంధం ఉన్న వారు ఈ సమయంలో లాభాలను పొందుతారు. ఈ టైంలో పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుడు ధనుస్సు రాశిలోని 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో విజయాలు లభిస్తాయి. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. మీడియా, సినిమా లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి చెందిన వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది.  మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేటివ్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం. 

మకరరాశి (Capricorn); మకర రాశి వారి జాతకంలో శుక్ర గ్రహం పదవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో ఈ రాశివారు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. జాబ్ కోసం ఎదురుచూసేవారికి మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభిస్తుంది. బిజినెస్ పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. 

Also Read: Budhaditya Yoga: దీపావళి తర్వాత బుధాదిత్య యోగం.. ఈ 3 రాశులవారి కెరీర్ అద్భుతం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News