Shukra Gochar 2022: శుక్రుడు... ఆనందం, వైభవం మరియు విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్రుడు జూన్ 18న తన రాశిని మార్చబోతున్నాడు. వృషభరాశిలో శుక్రుని సంచారం (Venus Transit in Taurus) జూన్ 18వ తేదీ ఉదయం 08.27 గంటలకు జరుగుతుంది. జూన్ 18 నుండి జూలై 13 వరకు శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు ఆర్థికంగా బలపడతారు. వృషభ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల 6 రాశుల వారు ధనవంతులు అవుతారు. ఆ రాశులేంటో చూద్దాం.
మేషం (Aries): శుక్రుని వల్ల మీకు విజయం లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద మెుత్తంలో లాభం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా భారీగా డబ్బును పొందుతారు.
వృషభం (Taurus): ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త పనిలో విజయం సిద్ధిస్తుంది.
కర్కాటకం (Cancer): ఆదాయంలో పెరుగుదల, వృత్తిలో పురోగతి ఉంటుంది. హోదా, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి.
సింహం (Leo): కొత్త ఉద్యోగం దొరుకుతుంది. అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో ఎదగడానికి ఇదే సరైన సమయం. భాగస్వామ్యంతో చేసే పనులు విజయవంతమవుతాయి.
వృశ్చికం (Scorpio): అదృష్టంతో ఆదాయం పెరుగుతుంది. మీరు వ్యాపారంలో లాభాలతో ధనవంతులు అవుతారు. కొత్త పనులు విజయవంతం కాగలవు.
కన్య (Virgo): పూర్వీకుల ఆస్తిలో కొంత భాగం దక్కుతుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
Also Read: Sun Transit Effect: మిథునరాశిలో సూర్య సంచారం... ఈ 5 రాశులవారు జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook