Vishwakarma Puja 2022: దేవశిల్పి విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17, శనివారం జరుపుకుంటారు. ఈ రోజున పనిముట్లు, యంత్రాలు, వాహనాలు మెుదలైన వాటిని పూజిస్తారు. ఈ ఏడాది విశ్వకర్మ పూజ (Vishwakarma Puja 2022) రోజున ఐదు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఇందులో సర్వార్థ సిద్ధియోగం మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం. ఈ యోగంలో విశ్వకర్మను పూజించడం వల్ల మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీంతోపాటు రవి యోగం, అమృత సిద్ధి యోగం, సిద్ధి యోగం, ద్విపుష్కర యోగం అనే నాలుగు యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల వల్ల విశ్వకర్మ పూజకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది.
యోగాల శుభసమయం
సర్వార్థ సిద్ధి యోగం: ఉదయం 06:07 నుండి మధ్యాహ్నం 12:21 వరకు
ద్విపుష్కర యోగం: మధ్యాహ్నం 12.21 నుంచి 02.14 వరకు
రవియోగం: ఉదయం 06:07 నుండి మధ్యాహ్నం 12:21 వరకు
సిద్ధి యోగం: ఉదయం నుండి రాత్రి వరకు
అమృత సిద్ధి యోగం: ఉదయం 06:07 నుండి మధ్యాహ్నం 12.21 వరకు
ఈ యోగాల ప్రాముఖ్యత
సర్వార్థ సిద్ధి యోగం మీ కోరికలను నెరవేర్చబోతోంది. రవి యోగం వల్ల అశుభం తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ద్విపుష్కర యోగంలో చేసే పూజలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. సిద్ధి మరియు అమృత సిద్ధి యోగాలను కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున రాహు కాలం ఉదయం 09.11 నుండి 10.43 వరకు ఉంటుంది. రాహుకాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook