Weekly Horoscope In Telugu: హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై 15 నుంచి కొత్త వారం ప్రారంభం కానుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జులై మూడవ వారం ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలోనే కన్యారాశిలోకి కేతువుతోపాటు శుక్రుడు సంచారం చేయబోతున్నాయి. అలాగే జూలై 16వ తేదీన కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన గ్రహాలు కొన్ని సంచారం చేయబోతున్నాయి. దీంతోపాటు ప్రతి నెల గ్రహ సంచారం చేసే బుధుడు కూడా జులై 19న సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఈ వారం ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
మేషరాశి:
ముఖ్యంగా మేష రాశి వారికి ఈ వారం డబ్బు సమస్యలు అస్సలు ఉండవు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సీనియర్ల నుంచి మద్దతు లభించి, అద్భుతమైన పేరును సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ వారం ఊహించని దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించడమే కాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే గతంలో నిలిచిపోయిన డబ్బులు సులభంగా తిరిగి వస్తాయి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ వారం మధ్యలో వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆశించిన ఫలితాలు పొందడమే కాకుండా కొత్త పెట్టుబడులు కూడా పెడతారు. అలాగే ప్రేమ జీవితంలో సమస్యలు అనుభవిస్తున్న వారు ఈ వారంలో మాధుర్యమైన జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా మేష రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వ్యక్తులకు మంచి లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం సహకరించి కష్టమైన పనుల్లో కూడా ఎంతో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు దృష్టి మొత్తం వాటి పైనే ఉంచాల్సి ఉంటుంది. దీనికి కారణంగా వీరు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. భార్యతో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఈ వారం మొదటి రోజు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ఎంతో మంచిది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి డబ్బు పణంగా చూస్తే ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే వీరికి ఈ సమయంలో పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆందోళన చెందకుండా పనులను పూర్తి చేయడం వల్ల సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో మీపై మీకు విశ్వాసం పెరిగి కఠినమైన పరిస్థితిలో కూడా గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తారు. దీంతో పాటు ఖర్చులు కూడా తగ్గి బడ్జెట్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే అనేక నష్టాలు వచ్చే అవకాశాలు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
సింహరాశి:
సింహ రాశి వారికి జులైలోని మూడవ వారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కోరుకున్న కోరికలు సహకారం చేసుకోవడంతో పాటు ఎలాంటి పనుల్లోనైనా మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరు కొత్త ఇల్లుతో పాటు ఈ వారం ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే కష్టపడి పనులు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అనుకున్న ఆర్థిక లాభాలు కూడా ఎంతో సులభంగా పొందగలుగుతారు. అయితే వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడును పెట్టడం ఎంతో మంచిది. ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ సమయంలో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే వీరికి ఒత్తిడి తగ్గి ఎలాంటి పనులైనా ఎంతో సులభంగా చేసి కార్యాలయంలో మంచి పేరు పొందుతారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Weekly Horoscope: జులై 3 వారంలో ఈ రాశుల వారు ఎక్కువ లాభపడతారు.. మీ రాశి ఉందా?