Shiva Abhishekam Items: శివుడికి నీళ్లు,పూలుతో పూజిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నీళ్లులతోనే కాకుండా మరి కొన్ని పదార్ధాలను ఉపయోగి పూజ చేయడం వల్ల మహా శివుడు ఎంతో సంతృప్తి చెందుతారని పండితులు చెబుతున్నారు. అనుకున్న కోరికలు వెంటనే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆవుపాలు: మహాశివుడిని ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల గొప్ప లాభాలను పొందుతారు. ఆవుపాలతో పూజ చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఆవు పెరుగు: ఆవు పాలతోనే కాకుండా ఆవు పెరుగుతో కూడా శివుడికి అభిషేకం చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో పూజ చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు బలము, యశస్సు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆవు నెయ్యి: సాధారణ నెయ్యి కన్నా ఆవు నెయ్యితో పూజలు చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా పరమశివుడికి ఆవు నెయ్యితో పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం పందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.
తేనె: తేనెతో మహా శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగుతాయి. అంతేకాకుండా తేజోవృద్ధి కలుగుతుంది.
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లుతో అభిషేకం చేయడం వల్ల సర్వసంపదలు కలుగుతాయి. ప్రతి సోమవారం మహాశివుడికి కొబ్బరి నీళ్లుతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సుగంధ జలం: సుగంధ వెదజల్లే వాటిని మహాశివుడు ఎంతో ఇష్ట పడుతారు. ముఖ్యంగా సుగంధ జలంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Also Read: February Rasi Phalalu 2024: ఫిబ్రవరి నెల రాశి ఫలాలు..ఈ రాశులవారికి డబ్బే డబ్బు!
ద్రాక్ష రసం: ద్రాక్ష రసంలో పూజ చేయడం వల్ల భూ లాభం కలుగుతుంది. అనుకున్నపనులు కూడా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
బిల్వ పత్రం: బిల్వజలంతో భోగ భాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. బిల్వజలంతో పాటు శివుడి మంత్రం జపించడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు.
ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల ఆ పరమశివుడి చల్లని చూపు మీపై ఎల్లప్పుడు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. ఈసారి మీరు అభిషకం చేసినప్పుడు మీరు తప్పకుండా పైన చెప్పిన వాటితో పూజ చేసుకోవచ్చు. వీటితో పూజలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter