Tanmay Singh: క్రికెట్‌ గ్రౌండ్‌లో సిక్సర్ల తుఫాను.. 132 బంతుల్లోనే 401 పరుగులు

Tanmay Singh Wonderful Batting 401: క్రికెట్‌ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. 13 ఏళ్ల బాలుడు పరుగుల సునామీ సృష్టించాడు. బౌండరీలతో చెలరేగి కేవలం 132 బంతుల్లోనే 401 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అండర్-14 టోర్నీలో తన్మయ్ సింగ్ అద్భుతమైన ఫీట్ సాధించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 12:43 PM IST
Tanmay Singh: క్రికెట్‌ గ్రౌండ్‌లో సిక్సర్ల తుఫాను.. 132 బంతుల్లోనే 401 పరుగులు

Tanmay Singh Wonderful Batting 401: అండర్-14 టోర్నీలో తన్మయ్ సింగ్ అనే బాలుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 132 బంతుల్లోనే 401 పరుగులు సాధించాడు. ఇందులో  30 ఫోర్లు, 38 సిక్సర్లు ఉన్నాయి. సోమవారం నోయిడాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన మ్యాచ్‌లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరుఫున బరిలోకి దిగిన తన్మయ్ సింగ్.. చిచ్చరపిడుగులా చెలరేగి ఆడాడు. అతనికి తోడు రుద్ర బిధురి అజేయంగా 135 పరుగులు చేయడంతో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగులు చేసింది. అనంతరం ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దేవరాజ్ స్కూల్ 463 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది.

ఇప్పటికే స్కూల్ క్రికెట్, క్లబ్ క్రికెట్‌లో ఎంతోమంది క్రికెటర్లు చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా వంటి క్రికెట్ ప్లేయర్లు చిన్నతనంలోనే చిచ్చరపిడుగుల్లా చెలరేగి ఆడిన ప్లేయర్లే. తాజాగా వారి సరసన తన్మయ్ సింగ్ కూడా నిలిచాడు. 13 ఏళ్ల వయసులోనే అతను అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడటం విశేషం. 

ఈ మ్యాచ్‌ ర్యాన్ ఇంటర్నేషనల్ కెప్టెన్ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఇన్నింగ్స్‌ ఆరంభించిన తన్మయ్ సింగ్.. మొదటి నుంచే చితక్కొట్టడం ప్రారంభించాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ తరలించాడు. ఏకంగా 38 సిక్సర్లు, 30 ఫోర్లు బాదడంటే.. అతడి బాదుడు ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సిక్సర్లతో 226 పరుగులు, ఫోర్లతో 120 రన్స్ సాధించాడు. అతని సూపర్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఫీల్డర్లు బౌండరీ దగ్గరే బంతి కోసం ఫీట్లు చేశారు. 

656 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టు.. ఏదశలోనూ కనీస పోరాడలేకపోయింది. కళ్ల ముందు భారీ లక్ష్యం కనిపిస్తుండడంతో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారు. దీంతో 193 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్‌కు క్యూ కట్టారు. దేవరాజ్ స్కూల్ 463 రన్స్ భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది.

స్కూల్ డేస్‌లో సచిన్, వినోద్ కాంబ్లీ రికార్డుస్థాయి ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. పాఠశాల టోర్నమెంట్‌లో 646 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శారదాశ్రమ్ విద్యామందిర్ తరఫున సచిన్ 326, కాంబ్లీ 349 రన్స్ చేశారు. హారిస్ షీల్డ్‌లో సర్ఫరాజ్ 439, పృథ్వీ షా 546 పరుగులు చేశారు.

Also Read: Karnataka Student Death: రాక్షసుడిగా మారిన ఉపాధ్యాయుడు.. విద్యార్థిని కొట్టి హత్య.. తల్లిపై రాడ్‌తో దాడి  

Also Read: Babar Azam: కోహ్లీకి సాధ్యంకాని రికార్డు అందుకున్న బాబర్ అజామ్.. రికీ పాంటింగ్ సరసన పాక్ కెప్టెన్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News