Kapil Dev Video Viral: భారత జట్టుకు తొలి వరల్డ్ కప్(ODI World Cup 1983) అందించిన ఘనత కపిల్ దేవ్(Kapil Dev )కు దక్కుతుంది. టీమిండియా గొప్ప కెప్టెన్లలో కపిల్ ఒకరు. అంతేకాకుండా నిఖార్సైన ఆల్ రౌండర్ కూడా. కపిల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు కిడ్నాప్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
'ఎవరికైనా ఈ వీడియో క్లిప్ వచ్చిందా..అందులో ఉన్న వ్యక్తి కపిల్ దేవ్ కాదనుకుంటున్నా.. కపిల్ పాజీ సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా' అని గౌతీ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్‌ను బలవంతంగా లాక్కెళ్తున్నారు. అంతేకాకుండా అతడి చేతులను వెనక్కి కట్టేసి.. నోట్లో గుడ్డలు కూడా కుక్కారు. కొంత దూరం వెళ్లాక కపిల్ వెనక్కి తిరగడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే.. ఇదంతా డ్రామా అని.. ఓ ప్రకటన కోసమే ఇలా చేశారని తెలిసి ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియోపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి.
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023
ఇటీవల వారణాసిలో జరిగిన అతి పెద్ద స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవి శాస్త్రితో కలిసి కపిల్ దేవ్ పాల్గొన్నారు. శివుడి రూపం ప్రతిబింబించేలా ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 1983లో టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో కపిల్ దేవ్ కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో జింబాబ్వేపై 175 పరుగులు చేయడం మ్యాచ్ కే హైలైట్.
Also Read: Pushpa 2 Updates: పుష్ప 2 డిజిటల్ రైట్స్ కు రికార్డు స్థాయి ధర.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook