2023 Sports Events:2023లో మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్

2023 Memorable Sports Event: 2023 సంవత్సరంలో  కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. చంద్రమండలం నుంచి క్రికెట్‌ వరకు భారత్‌ ప్రత్యేక గుర్తింపును చాటుకుంది.  ఈ సంవత్సరం భారత్‌ క్రిడల్లో వీర విహారం చేసింది. ఈ 2023లో జరిగిన అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్‌ అద్భుతమైన  విజయాలు సాధించింది. అది ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 10:20 PM IST
2023 Sports Events:2023లో  మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్

2023 Memorable Sports Event: 2023 సంవత్సరం మరి కొది క్షణాల్లో ముగియనుంది.. ఈ సంవత్సరం ఎన్నో అద్భుతమైన విశేషాలు జరిగాయి. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాల వరకు మనం సాధించిన ఘనత గరించి చర్చిన దేశం అంటూ లేదు. రాకెట్‌ నుంచి క్రీడల వరకు ఈ సంవత్సరం ఉహించని విశేషాలు జరిగాయి. అయితే 2023 జరిగిన కొన్ని భారత క్రీడారంగంలో కీలక ఘట్టాల గురించి మనం తెలుసుకుందాం..

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్‌ ఈ సంవత్సరం అద్భుతమైన  విజయాలు సాధించింది. భారత్‌ తమకంటూ ఓ విశేషమైన గుర్తింపు స్థానాన్ని కైవశం చేసుకుంది. క్రికెట్‌ , చెస్‌, పారా అథ్లెటిక్స్‌, ఆర్చరీ, ఫుట్‌బాల్‌, బ్యాడింటన్‌, అథ్లెటిక్స్‌, ఇతర క్రీడల్లో మన ఆటగాళ్లు ఈ ఏడాది భారత్ పేరును యావత్ ప్రపంచం వినిపించేలా మోత మోగించారు. 

ఈ సంవత్సరం సాధించిన అసాధారణమైన విజయాలు ఇవే...

జావెలిన్‌ త్రో దిగ్గజ ఆటగాడు నీరజ్‌ చోప్రా ఈ ఏడాది  వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ లో స్వర్ణం పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం భారత్‌ 100 పతకాల మార్కును దాటి నాలుగో స్థానంలో నిలిచింది.

 18 సంవత్సరాలకే  ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు  అర్హత సాధించాడు రమేష్‌బాబు ప్రజ్ఞానంద.  అతి చిన్న వయసులో ప్రపంచకప్‌కు అర్హత సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

✪  బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సాధించిన తొలి భారత జోడీగా రికార్డు సాధించింది బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.

 ఈ ఏడాది తొమ్మిదోసారి SAFF చాంపియన్‌లో కువైట్‌పై ఘన విజయం సాధించడంతో పాటు ఫిఫా వరల్డ్‌కప్‌ రౌండ్‌-2కు అర్హత సాధించింది టీమిండియా ఫుట్‌బాల్‌ జట్టు.

2023లో టీమిండియా మెన్స్ క్రికెట్‌ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ జట్టుగా నిలిచింది.

ఈసారి క్రికెట్‌లో మహిళలు సత్తా చాటుకున్నారు.  భారత మహిళల అండర్ 19 జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది.

వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌ వరకు అద్బుతంగా ఆడిన భారత్.. తుది మెట్టుపై కంగారూల చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

 ఆసియా పారా గేమ్స్‌ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలను భారత పారా అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. ఈ పోటీలో ఐదో స్థానంలో నిలిచింది.

అతి చిన్న వయసులోనే  అర్చరీలో వరల్డ్‌ టైటిల్‌ను సాధించింది అదితి స్వామి

ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ అరుదైన పతకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది. 

Also Read: MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News