ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఫుట్ బాల్

ఈ బుడతడ్ని చూస్తే .. హా... నిండా పదేళ్లు లేవు.. వీడేం చేస్తాడులే .. అంటారు. కానీ చాలా చేస్తానని.. తొడగొడుతున్నాడు. చూస్తే వేలెడంత లేడు కానీ.. ఫుట్ బాల్ గ్రౌండ్ అంతా నాదే అంటున్నాడు ఈ బుడ్డోడు. 

Updated: Feb 17, 2020, 04:36 PM IST
ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఫుట్ బాల్

ఈ బుడతడ్ని చూస్తే .. హా... నిండా పదేళ్లు లేవు.. వీడేం చేస్తాడులే .. అంటారు. కానీ చాలా చేస్తానని.. తొడగొడుతున్నాడు. చూస్తే వేలెడంత లేడు కానీ.. ఫుట్ బాల్ గ్రౌండ్ అంతా నాదే అంటున్నాడు ఈ బుడ్డోడు.  

ఈ చిన్నోడు .. కేరళ వాయనాడుకు చెందిన ధని. పేరుకు తగ్గట్టే ధనా.. ధన్  దమ్ముంది నాలో అని చూపిస్తున్నాడు. ఫుట్ బాల్‌లో చాలా మంది మహామహులకే సాధ్యం కానీ 'జీరో యాంగిల్' గోల్ వేసి చూపించాడు.  ఆల్ కేరళ కిడ్స్ ఫుట్ బాల్ టోర్నమెంట్‌లో ఈ ఘనత సాధించాడు. కార్నర్ గోల్ వేసే అవకాశం రాగానే ..  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా . .  జీరో యాంగిల్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో గ్రౌండ్‌లో ఆట చూస్తున్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో బుడ్డోడిని అభినందించారు.

ఇదే మ్యాచ్ లో ధని సాధించిన ఘనత చూస్తే .. మీరు ఆశ్చర్యపోతారు. హ్యాట్రిక్ గోల్ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే కాదు .. మొత్తంగా టోర్నమెంట్  లో 13 గోల్స్ వేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' కొట్టేశాడు.