Abu Dhabi T10: అబుదాబి టీ10 లీగ్‌లో డిఫరెంట్ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో Viral Video

Absurd Moment When Fielder Changing Jersey Fails To Stop Boundary: బంతి ఎప్పుడు తమవైపు చూస్తుందా అని చూసే ఫీల్డర్లను మీరు చూసి ఉంటారు. కానీ క్రికెట్ మైదానంలో వెరైటీ ఫిల్డింగ్ చేయడంతో అబుదాబి టీ10 లీగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 2, 2021, 02:20 PM IST
  • పొట్టి లీగ్ టీ10 లీగ్ ఇదివరకే ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందించింది
  • తాజాగా జరిగిన సంఘటన మాత్రం సూపర్ ఇన్నింగ్స్‌ల కన్నా వేగంగా వైరల్ అవుతోంది
  • బంతి తన పక్క నుంచి బౌండరీకి వెళ్తుంటే ఫీల్డర్ జెర్సీ మార్చుకుంటున్నాడు
Abu Dhabi T10: అబుదాబి టీ10 లీగ్‌లో డిఫరెంట్ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో Viral Video

Abu Dhabi T10: టీ20 కంటే పొట్టి లీగ్ టీ10 లీగ్ ఇదివరకే ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందించింది. తాజాగా అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10లీగ్‌లో వెస్టిండీస్ టాలెంటెడ్ క్రికెటర్ నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్, వేన్ పార్నెల్ హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శణ లాంటివి క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందించాయి. 

తాజాగా జరిగిన సంఘటన మాత్రం సూపర్ ఇన్నింగ్స్‌ల కన్నా వేగంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. బ్యాట్స్‌మ‌న్ కొట్టిన బాల్ ఫీల్డర్ పక్క నుంచి వెళ్తున్న బంతిని ఆపలేకపోవడంతో అది బౌండరీ లైన్ దాటింది. అయితే జెర్సీ వేసుకుంటుంటడంతో ఫీల్డర్ బంతిని ఆపలేకపోవడం గమనార్హం. ఈ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైర‌ల్‌గా మారిపోయింది. 

Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 2, 2021 Rasi Phalalu

 

 

 

సోమవారం నాడు నార్నన్ వారియర్స్, అబుదాబి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే వారియర్స్ బ్యాట్స్‌మన్ వసీమ్ మహమ్మద్ ఆడిన బంతి రోహ‌న్ ముస్తాఫా దిశగా దూసుకొచ్చింది. అయితే ఆ సమయంలో అతడు జెర్సీ మార్చుకుంటున్నాడు. దీంతో బంతి బౌండరీ చేరుకుంది. ఇది చూసిన ప్రత్యర్థి వారియర్స్ ఆటగాళ్లతో పాటు సొంత జట్టు అబుదాబి ఆటగాళ్లు నవ్వుకున్నారు. రోహన్ ముస్తాఫా ఫీల్డింగ్ వీడియో(Viral Video) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

Also Read: CBSE Board Exam 2021: మరికాసేపట్లో సీబీఎస్ఈ Class 10, Class 12 Time Tables విడుదల 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News