అజింక్య రహానేని పొగడ్తల్లో ముంచెత్తిన దాదా

 రెహానేపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు.

Last Updated : Dec 19, 2017, 11:34 AM IST
అజింక్య రహానేని పొగడ్తల్లో ముంచెత్తిన దాదా

అజింక్య రహానేని పొగడ్తల్లో ముంచెత్తాడు టీమిండియా మాజీ కెప్టేన్ సౌరబ్ గంగూలీ. స్వదేశంలో శ్రీలంకపై ఆడిన ఐదు ఇన్నింగ్స్ లో రహానే చేసింది 17 పరుగులే అయినప్పటికీ ఉపఖండం వెలుపల ఆడిన మ్యాచ్ ల్లో అతడి పర్ ఫార్మెన్స్ కీలకమైనదే అని అజింక్య రహానేపై తనకి వున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు దాదా. సౌత్ ఆఫ్రికా పర్యటనకి అజింక్య రహానే ఎంపికపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పే క్రమంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు. 

బెంగాల్-ఢిల్లీ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ వద్ద పీటీఐతో మాట్లాడిన దాదా... అజింక్య రహానే పర్ ఫార్మెన్స్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. "విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్ లాంటి వాళ్లంతా ఇప్పటికే సౌత్ ఆఫ్రీకాలో పర్యటించి వచ్టిన వాళ్లే. కాకపోతే ఈసారి వాళ్లు మరింత మెరుగైన ఆటగాళ్లుగా తిరిగి సౌతాఫ్రికా పర్యటనకి వెళ్తున్నారు'' అని అన్నాడు. 

 

More Stories

Trending News