ఆసియా కప్ 2018 : ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ నడ్డి విరిచిన మలింగ!

ఆదిలోనే కష్టాల్లో పడిన బంగ్లాదేశ్  

Last Updated : Sep 15, 2018, 07:27 PM IST
ఆసియా కప్ 2018 : ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ నడ్డి విరిచిన మలింగ!

ఆసియా కప్ 2018 క్రికెట్ పోటీల్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆటలో శ్రీలంక కెప్టేన్ మష్రాఫే మొర్తాజ టాస్ గెలిచి లంకపై బ్యాటింగ్ ఎంచుకోగా లంక బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆదిలోనే తడబడటం మొదలుపెట్టారు. కేవలం ఒకే ఓవర్ లో లంక బౌలర్ లసిత్ మలింగ రెండు కీలకమైన వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. లసిత్ మలింగ విసిరిన బంతులకు బంగ్లా క్రికెటర్ లితొన్ దాస్ (0), ఆ తర్వాత షకీబ్ అల్ హసన్ (0) డకౌట్ అయి పెవిలియన్ బాట పట్టారు. మొత్తం 3 ఓవర్లు ముగిసేవరకు 2 వికెట్ల నష్టానికి కేవలం 3 పరుగులే చేసిన బంగ్లాదేశ్ మొట్టమొదట్లోనే తీవ్ర కష్టాల్లో పడింది. 

More Stories

Trending News