ఆసియా క్రీడలు 2018: పురుషుల ట్రిపుల్ జంప్‌లో పసిడి పతకం పొందిన ఇండియన్ హీరో "అర్పిందర్ సింగ్"

ఆసియా క్రీడల్లో మరోసారి భారత్ క్రీడాకారుడు సరికొత్త చరిత్రను నమోదు చేశాడు. ట్రిపుల్ జంప్‌లో రికార్డు స్థాయిలో 16.77 మీటర్లు దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

Last Updated : Aug 29, 2018, 09:43 PM IST
ఆసియా క్రీడలు 2018: పురుషుల ట్రిపుల్ జంప్‌లో పసిడి పతకం పొందిన ఇండియన్ హీరో "అర్పిందర్ సింగ్"

ఆసియా క్రీడల్లో మరోసారి భారత్ క్రీడాకారుడు సరికొత్త చరిత్రను నమోదు చేశాడు. ట్రిపుల్ జంప్‌లో రికార్డు స్థాయిలో 16.77 మీటర్లు దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరుసార్లు జరిగిన ప్రయత్నాల్లో అర్పిందర్ మూడు సార్లు విఫలమైనప్పటికీ.. మూడు సార్లు మాత్రం రికార్డు స్థాయిలో ప్రదర్శన చేయడంతో ఆయనను పసిడి పతకం వరించింది. ఇది ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన పదవ బంగారు పతకం. ట్రిపుల్ జంప్ పోటీల్లో స్వర్ణాన్ని భారత్ కైవసం చేసుకోగా.. రజతాన్ని ఉజ్బెకిస్తాన్, కాంస్యాన్ని చైనా దేశాలు కైవసం చేసుకున్నాయి.

అర్పిందర్ సింగ్ గతంలో కూడా భారత్‌కు పతకాలు తీసుకొచ్చాడు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో ఆయన కాంస్య పతకాన్ని పొందాడు. అలాగే జాతీయ క్రీడలలో కూడా అర్పిందర్ 17.17 మీటర్ల వ్యక్తిగత రికార్డును కలిగి ఉన్నాడు. ఆ రికార్డును ఆయన లక్నోలో నమోదు చేశాడు. అలాగే 2017లో జరిగిన ఆసియా ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో కూడా అర్పిందర్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

30 డిసెంబరు 1992లో జన్మించిన అర్పిందర్ పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతంలో పుట్టిపెరిగారు. ఆయన క్రీడారంగానికి వచ్చిన తొలినాళ్లలో యాంజిలన్ మెడల్ హంట్ కంపెనీ అందించిన ఆర్థిక సహాయంతో పోటీలకు వెళ్లేవారు. ఒలింపిక్స్‌ స్థాయికి వెళ్లేవిధంగా క్రీడాకారులకు శిక్షణ అందించడం ఆ సంస్థ లక్ష్యం. ఎస్ ఎస్ కన్ను ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్న అర్పిందర్.. 2013లో పూణెలో జరిగిన ఆసియన్ ఛాంపియన్ షిప్‌లో కూడా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 

Trending News