ఆసియా క్రీడలు 2018: బాక్సింగ్‌లో భారత్‌కి గోల్డ్ మెడల్

భారత్‌కి 14వ బంగారు పతకం

Last Updated : Sep 1, 2018, 06:14 PM IST
ఆసియా క్రీడలు 2018: బాక్సింగ్‌లో భారత్‌కి గోల్డ్ మెడల్

ఈ ఏడాది నిర్వహిస్తోన్న ఆసియా క్రీడలు నేడు 14వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు ఈవెంట్స్ లో భాగంగా జరిగిన లైట్ ఫ్లై బాక్సింగ్(49కేజీల) పోటీల్లో భారత్ గోల్డ్ మెడల్ గెల్చుకుంది. బాక్సింగ్ ఫైనల్ పోటీల్లో ఉబ్జెకిస్తాన్‌కి చెందిన హసన్‌బాయ్ డుస్మతోవ్‌తో పోటీపడిన భారత బాక్సర్ అమిత్ పంఘాల్ ప్రత్యర్థిని మట్టికరిపించి భారత్‌కి స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ గెల్చుకున్న గోల్డ్ మెడల్స్ సంఖ్య 14కి చేరుకుంది. 2016లో ఒలంపిక్స్ ఛాంపియన్ అయిన హసన్‌బాయ్ డుస్మతోవ్‌‌ని 22 ఏళ్ల భారత కుర్రాడు అమిత్ పంఘాల్ ఓడించడం విశేషం. 

Trending News